
ఒకే ఏడాది కోలుకోలేని మూడు దెబ్బలు తగలడంతో మహేష్ బాబు పూర్తిస్థాయిలో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. అంతే కాదు ఆయన తిరిగి మునుపటి స్టేజ్ కి రావాలని అభిమానులు కూడా పెద్ద ఎత్తున కోరుకున్నారు. ఇదిలా ఉండగా అంత దుఃఖంలో కూడా తన తండ్రికి జరగాల్సిన అన్ని కార్యక్రమాలను దగ్గరుండి మరి నిర్వహించారు. మహేష్ బాబు అందులో భాగంగానే ఆదివారం రోజున తన తండ్రి దశదినకర్మను పూర్తిచేసి 40 రకాల వంటలతో వచ్చిన అతిథులకు విందు కూడా ఏర్పాటు చేయించారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన మహేష్ బాబు ఇప్పుడు అభిమానులకు మరో గుడ్ న్యూస్ వెల్లడించారు.
అదేమిటంటే ఇంత దుఃఖంలో కూడా ఆయన మళ్లీ సినిమా షూటింగ్ చేస్తానని ప్రకటించడం అభిమానులకు కాస్త గుడ్ న్యూస్ అనే చెప్పాలి. బాధ నుంచి మహేష్ బాబు త్వరగా రికవరీ కావాలని కోరుకుంటున్న అభిమానులకు.. త్రివిక్రమ్ - మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న #SSMB28 సినిమా షూటింగు డిసెంబర్ 8 నుంచి తిరిగి ప్రారంభం అవుతుందని అధికారికంగా ప్రకటించడం కాస్త ఊరట నిచ్చే అంశం అని చెప్పవచ్చు.. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులోనే మొదలుకానున్న నేపథ్యంలో మహేష్ బాబు హాజరు కాబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా సినిమా షూటింగ్ సెట్లోకి వెళితే తన బాధను మహేష్ బాబు మరిచిపోయే అవకాశం ఉందని అభిమానులు వెల్లడిస్తున్నారు.