మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య కాలంలో వరస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా చిరంజీవి తాజాగా బాబీ దర్శకత్వంలో మైత్రి సంస్థ నిర్మించిన వాల్తేరు వీరయ్య అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని జనవరి 13 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని అంతకు ఒక రోజు ముందుగా అనగా జనవరి 12 వ తేదీనే యూఎస్ఏ లో ప్రీమియర్ షో లు వేయనున్నారు. 

ఈ ప్రీమియర్ షో లకు సంబంధించిన అడ్వాన్స్ ప్రీ సేల్స్ ఇప్పటికే మొదలు అయ్యాయి. అందులో భాగంగా ఈ మూవీ కి ఇప్పటివరకు 400 కే ప్లస్ కలెక్షన్ లు లభించాయి. ఈ విషయాన్ని ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను యూఎస్ఏ లో శ్లోక ఎంటర్టైన్మెంట్ సంస్థ భారీ ఎత్తున విడుదల చేయబోతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని తెలుగు మరియు హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. 

అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన తెలుగు మరియు హిందీ ప్రచార చిత్రాలను ఈ సినిమా బృందం విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ లో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. మాస్ మహారాజా రవితేజ కీలకమైన పాత్రలో నటించిన ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ ... బాబీ  సింహ ఇతర ముఖ్యమైన పాత్రలో నటించారు. ఊర్వసి రేటేల ఈ మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించగా ... కేథరిన్ ఒక కీలకమైన పాత్రలో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: