
ఈ సినిమా ట్రైలర్ ను ఇవ్వాల తెలుగు ట్రైలర్ ను బాలయ్య , తమిళ ట్రైలర్ ను అనిరుద్ లు విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ ను పూర్తిగా నింపేశారని చెప్పాలి. ఇక ట్రైలర్ ను చూసిన వారికి అర్ధమయ్యే విషయం ఒకటే.. తాను ప్రేమించిన అమ్మాయి కోసం సందీప్ చేసిన మారణకాండ. గతమూ పురాణాల్లో చెప్పుకున్న విధంగా ఆడవాళ్ళ కోసం యుద్దాలు జరిగాయి అని తెలిసిందే. అయితే ఎందుకు అమ్మాయి కోసం ఇలా చేయాల్సి వచ్చిందన్న విషయం మాత్రం థియేటర్ లోనే తెలుసుకోవలసి వస్తుంది. చిత్ర బృందం సమాచారం ప్రకారం ఈ సినిమాను ఫిబ్రవరి 3 న రిలీజ్ చేస్తున్నారు.
ఇందులో సందీప్ కిషన్ కు సరసన దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్, వరుణ్ సందేశ్, విజయ్ సేతుపతి, అనసూయ భరద్వాజ్ మరియు వరలక్ష్మి శరత్ కుమార్ లు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను రంజిత్ జైకోడి చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమా హిట్ కావడం సందీప్ కిషన్ కు చాలా అవసరం. టోటల్ సినిమా యూనిట్ కూడా సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందన్న నమ్మకంతోనే ఉన్నారు. మరి ఎటువంటి ఫలితం వస్తుందో తెలియాలంటే మరో పది రోజుల వరకు వెయిట్ చేయాల్సిందే.