తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటుడు ... దర్శకుడు అయినటువంటి అవసరాల శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా తెలుగు తిని ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు నాగ శౌర్య హీరోగా రాసి కన్నా హీరోయిన్ గా రూపొందినటువంటి ఊహలు గుసగుసలాడే మూవీ తో దర్శకుడుగా కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో దర్శకుడిగా అవసరాల శ్రీనివాస్ కు మంచి గుర్తింపు లభించింది. ఈ మూవీ తర్వాత అవసరాల శ్రీనివాస్ అనేక మూవీ లకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడుగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ దర్శకుడు నాగ శౌర్య హీరోగా రూపొందినటు వంటి ఫలానా అబ్బాయి ... పలానా అమ్మాయి అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని మరి కొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా అవసరాల శ్రీనివాస్మూవీ గురించి అనేక విషయాలు చెప్పుకొచ్చాడు. తాజాగా అవసరాల శ్రీనివాస్ పలానా అబ్బాయి పలానా అమ్మాయి మూవీ గురించి మాట్లాడుతూ ... ఈ మూవీ లో 7 చాప్టర్లు ఉంటాయి. ఒక్కో చాప్టర్ నిడివి దాదాపుగా 20 నిమిషాలు ఉంటుంది. ఈ 7 చాప్టర్లు పదేళ్ల వ్యవధిలో జరుగుతాయి.

ఈ పది సంవత్సరాలలో 18 నుంచి 28 ఏళ్ల వయస్సు వరకు నాగ శౌర్య మాళవిక పాత్రల ప్రయాణం ఉంటుంది. నాది మరియు నాగ శౌర్య కాంబినేషన్ లో సినిమా అనగానే అందరూ ఊహలు గుసగుసలాడే మూవీ తరహాలో రొమాంటిక్ కామెడీ సినిమా అయ్యుంటుంది అనుకుంటున్నారు. అయితే ఈ మూవీ స్క్రిప్ట్ లాగా అనిపించదు ... నిజ జీవితంలో పాత్రలు ఎలా ప్రవర్తిస్తాయో ... ఎలా మాట్లాడుతాయో అలాగే ఈ సినిమా ఉంటుంది. ట్రైలర్ చూశాక సినిమా ఎలా ఉంటుంది అనేది మీకు ఒక అవగాహన వస్తుంది అని అవసరాల శ్రీనివాస్ తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: