
శ్రీమంతుడు
మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కి 2015 లో విడుదల అయ్యి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు మొదట రామ్ చరణ్ హీరో అయితే బాగుంటుంది అని కొరటాల భావించాడట. చరణ్ కి కూడా కథ బాగా నచ్చిన డేట్స్ అడ్జస్ట్ చేయడం లో ఇబ్బందులు ఎదురుకావడం తో ఈ సినిమా వదులుకున్నాడు రామ్ చరణ్.
జెర్సీ
నాని హీరో గా నటించిన జెర్సీ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం లో నాని కెరీర్ లో మంచి సినిమా గా నిలిచింది. అయితే ఈ చిత్రాన్ని మొదట దర్శకుడు గౌతమ్ తిన్ననూరి చరణ్ తో చేయాలి అనుకున్నప్పటికీ అప్పటికే రాజమౌళి కి ఆర్ ఆర్ ఆర్ కి కమిట్ కావడం తో ఈ సినిమా చేయడం వీలు కాలేదు.
ఒకే బంగారం
దుల్కర్ సల్మాన్ మరియు నిత్య మీనన్ జంట గా వచ్చిన సినిమా ఒకే బంగారం. ఈ చిత్రం సైతం మొదట రామ్ చరణ్ దగ్గరికే వచ్చింది. ఒక అద్భుతమైన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ సినిమా రాం చరణ్ చేస్తే బాగుంటుంది అని దర్శకుడు భావించిన మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్న రామ్ చరణ్ లవ్ స్టోరీ చేయడం కుదరదు అని చెప్పాడట.