నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం తన కెరియర్ లో 108 వ మూవీ గా రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటి కాజల్ అగర్వాల్ ... బాలయ్య సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... శ్రీ లీల ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఈ మూవీ కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న దర్శకుడుగా కెరియర్ ను కొనసాగిస్తున్న అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం దసరా పండగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో బాలకృష్ణ కాళీమాత భక్తుడిగా కనిపించబోతున్నట్లు ... అలాగే ఈ సినిమాలో కాళీమాత దేవాలయంలో వచ్చే ఓ సీక్వెన్స్ కూడా చాలా బాగుంటుంది అని తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో బాలకృష్ణ తెలంగాణ మాండలికంలో మాట్లాడబోతున్నట్లు తెలుస్తోంది.  

అఖండ మరియు వీర సింహా రెడ్డి లాంటి అద్భుతమైన విజయవంతమైన సినిమాల తర్వాత బాలకృష్ణ నటిస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమాకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు ... దానితో ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 108 వ రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ యొక్క షూటింగ్ ను ఎన్ బి కె 108 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ బృందం పూర్తి చేస్తూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: