మాస్ మహారాజా రవితేజ పోయిన సంవత్సరం విడుదల అయినటువంటి ధమాకా మూవీ తో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నాడు. ఇలా పోయిన సంవత్సరం సోలో గా అద్భుతమైన విజయాన్ని అందుకున్న రవితేజ ఈ సంవత్సరం చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించి మంచి విజయం అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా రవితేజ "రావణాసుర" అనే మూవీ లో హీరో గా నటించాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో సుశాంత్ ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ ఏప్రిల్ 7 వ తేదిన థియేటర్ లలో విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ మూవీ 2 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ రెండు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.


రెండు రోజుల్లో నైజాం ఏరియాలో ఈ సినిమా 2.53 కోట్ల కలెక్షన్ లను వసూలు చేయగా ,  సీడెడ్ లో 1.12 కోట్లు , యూ ఏ లో 97 లక్షలు , ఈస్ట్ లో 49 లక్షలు , వెస్ట్ లో 32 లక్షలు , గుంటూరు లో 57 లక్షలు , కృష్ణ లో 32 లక్షలు , నెల్లూరు లో 22 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో 6.54 కోట్ల షేర్ ... 10.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో ఈ మూవీ రెండు రోజుల్లో 56 లక్షల కలెక్షన్ లను వసూలు చేయగా ... ఓవర్సీస్ లో 70 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో 7.80 కోట్ల షేర్ ...13.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: