ప్రస్తుతం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర విరూపాక్ష ... ఏజెంట్ ... పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 మూవీ లు పోటీ పడుతున్నాయి. అందులో భాగంగా నిన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ మూవీ కి ఏ రేంజ్ లో షేర్ కలక్షన్ లు వచ్చాయో తెలుసుకుందాం.

విరూపాక్ష : సాయి ధరమ్ తేజ్ హీరో గా సంయుక్తా మీనన్ హీరోయిన్ గా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఏప్రిల్  21 వ తేదీన విడుదల అయ్యి  బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి ప్రస్తుతం బాక్సా ఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ కలెక్షన్ లు దక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే నిన్న అనగా ఏప్రిల్ 29 వ తేదీన ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.84 కోట్ల షేర్ కనెక్షన్ లు దక్కాయి.

ఏజెంట్ : అక్కినేని అఖిల్ హీరోగా సాక్షా వైద్య హీరోయిన్ గా  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఏప్రిల్ 28 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ లభించింది. ఈ మూవీ కి నిన్న అనగా ఏప్రిల్ 29 వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లో 67 లక్షల షేర్ కలక్షన్ లు దక్కాయి.

పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 : మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో విక్రమ్ ,  కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష , శోభితా ధూళిపాల ,  ఐశ్వర్య లక్ష్మి కీలక పాత్రలలో నటించగా ... ఏ  ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ సినిమా ఏప్రిల్ 28 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ నిన్న అనగా ఏప్రిల్ 29 వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.58 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: