బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి ప్రస్తుతం హాలీవుడ్లో పలు చిత్రాలలో నటిస్తున్న హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తాజాగా ఈమె నటించిన సిటా డెల్ అనే వెబ్ సిరీస్ అమెజాన్లో స్ట్రిమింగ్ అవుతూ ఉండగా ఇప్పటికే విడుదలైన ఎపిసోడ్లు కూడా ప్రేక్షకుల నుంచి బాగానే స్పందన లభిస్తోంది. సరైన కథ దొరికితే ఎలాంటి భాషలోనైనా సరే సినిమా నటించడానికి ఓకే చెబుతున్నట్లు తెలుస్తోంది ప్రియాంక చోప్రా తాను ధరించిన నగల విషయంలో పలు జాగ్రత్తలు సైతం తీసుకుంటూ ఉంటుంది.

న్యూయార్క్ నగరంలో ఒక పెద్ద ఫ్యాషన్ ఈవెంట్ ఈ ఏడాది జరగదు ఈ ఈవెంట్లో తన భర్తతో కలిసి ప్రియాంక చోప్రా అక్కడ సందడి చేయడం జరిగింది అయితే ఈవెంట్లో ప్రియాంక చోప్రా ధరించిన నెక్లెస్ అందరిని అట్రాక్ట్ చేసేలా కనిపిస్తోంది. అయితే ప్రియాంక చోప్రా ధరించిన ఈ నక్లెస్ విలువ దాదాపుగా రూ .200 కోట్ల రూపాయలకు పైగా ఉండడం గమనార్హం. బాల్గారికి చెందిన 11.6 క్యారెట్ డైమండ్ నెక్లెస్ ఈమె ధరించినట్లుగా తెలుస్తోంది ప్రియాంక చోప్రా కూడా గతంలో ఇలాంటి ఈవెంట్లకు హాజరవుతూనే ఉంది.


తాజాగా బ్లాక్ అండ్ వైట్ దుస్తులను తన భర్తతో కలిసి సందడి చేయడం జరిగింది. ఈ ఈవెంట్ లో పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం సందడి చేయడం జరిగింది.ప్రస్తుతం అత్యుత్తమ ఫ్యాషన్స్ షోలో పాల్గొన్న ప్రియాంక చోప్రా దుస్తుల పైన కూడా మరింత ఫోకస్ చేయడం జరిగింది ఈవెంట్లో పాల్గొన్న సెలబ్రిటీలు సైతం ప్రియాంక చోప్రా దుస్తుల గురించి నెక్లెస్ గురించి మాట్లాడుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రియాంక చోప్రా ఒకో సినిమాకి కొన్ని కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది ఈమె కథలు ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా కు సంబంధించిన ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: