తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో జగపతి బాబు ఒకరు. జగపతి బాబు ఇప్పటికే ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి ... ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి... ఎన్నో సినిమాల్లో ముఖ్యమైన పాత్రలో నటించి నటుడిగా తనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం వరకు కేవలం సినిమాల్లో హీరో గా నటించిన జగపతి బాబు ఆ తరువాత హీరో గా నటించిన సినిమాలు వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతూ ఉండడంతో బాలకృష్ణ హీరో గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన లెజెండ్ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు.

మూవీ అద్భుతమైన విజయం సాధించడం అలాగే జగపతి బాబు నటనకు కూడా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించడంతో ఆ తర్వాత జగపతి బాబు కు విలన్ గా అదిరిపోయే అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఇప్పటికే ఈ నటుడు తెలుగు తో పాటు అనేక భాషల సినిమాల్లో కూడా నటించి ప్రేక్షకులను ఆదరించాడు. తాజాగా ఈ నటుడు గోపీచంద్ హీరో గా డింపుల్ హయాతి హీరోయిన్ గా శ్రీ వాసు దర్శకత్వంలో రూపొందిన రామబాణం అనే సినిమాలో కీలక పాత్రలో నటించాడు.

సినిమా మే 5 వ తేదీన విడుదల కాబోతుంది. తాజాగా ఈ సినిమా గురించి జగపతి బాబు మాట్లాడుతూ ... రామబాణం సినిమా అనేది సమాజంలో సానుకూలతను తీసుకువచ్చే మరియు వ్యాప్తి చేసే సినిమా. ఈ రోజుల్లో మన సెంటిమెంట్ లను గుర్తు చేయడానికి ఇలాంటి సినిమాలు రావడం చాలా అవసరం అని జగపతి బాబు చెప్పుకొచ్చాడు. ఈ మూవీ లో కుష్బూ కూడా కీలక పాత్రలో నటించింది. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: