పోయిన సంవత్సరం భారీ అంచనాల నడుమ బ్రహ్మాస్త్ర అనే హిందీ మూవీ విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి రన్బీర్ కపూర్ హీరో గా నటించగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి అలియా భట్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో అమితా బచ్చన్ ... నాగార్జున ... మౌని రాయ్ ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమా తెలుగు లో కూడా విడుదల అయింది.

తెలుగు లో ఈ సినిమా బ్రహ్మాస్త్రం అనే పేరుతో విడుదల అయింది. ఈ మూవీ ని తెలుగు లో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి విడుదల చేశాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. అలాగే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ డీసెంట్ కలెక్షన్ లను కూడా రాబట్టింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ మొత్తంగా మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ మరి కొన్ని రోజుల్లోనే బుల్లి తెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది.

తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ శాటిలైట్ సంస్థలలో ఒకటి అయినటు వంటి స్టార్ మా సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని త్వరలోనే స్టార్ మా చానల్లో ప్రసారం చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. మరి ఇప్పటికే థియేటర్ లలో మంచి విజయం సాధించి ఎంతో మంది ప్రేక్షకులను అలరించి ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఈ మూవీ యొక్క రెండవ మరియు మూడవ భాగం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నిలకోని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: