
తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తూ ఉండగా యాక్షన్ కొరియోగ్రాఫర్ అన్సర్వ్ స్టంట్ మాస్టర్ గా పనిచేస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఖైదీ, విక్రమ్ సినిమాలోని పాత్రలు ఈ చిత్రానికి కనెక్ట్ అయ్యేవిధంగా ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. డైరెక్టర్ లోకేష్ కనకరాజు ఈ చిత్రం అక్టోబర్ 19వ తేదీన ఈ ఏడాది విడుదల చేయబోతున్నట్లు సమాచారం. అయితే ఇందులోనే స్పెషల్ సాంగులు హీరోయిన్ శృతిహాసన్ ఐటెం సాంగ్ లో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఇంకా అధికారికంగా ప్రకటన అయితే వెలుబడలేదు కేవలం కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈ వార్తలు వైరల్ గా మారుతున్నాయి.
గతంలో తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన వారసుడు చిత్రం తో పరవాలేదు అనిపించుకున్న విజయ దళపతి ఈ ఏడాది కూడా లియో సినిమాతో ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తారేమో చూడాలి మరి. విజయ్ దళపతికి సరైన సక్సెస్ లేక దాదాపుగా కొన్ని సంవత్సరాలు పైనే అవుతొంది. దీంతో అభిమానులు సైతం లియో సినిమా పైన భారీగా అంచనాలు పెట్టుకున్నారు. మరి అంచనాలను మించిపోయేలా ఈ సినిమా ఉంటుందేమో చూడాలి మరి.