ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో మాస్ సినిమాల సందడి చాలా ఎక్కువగా కనిపించేది.ఇక ఎప్పుడైతే ఓటీటీలు వచ్చాయో అప్పటినుండి ప్రేక్షకుల టేస్ట్ సైతం మారిపోయింది.వేరే భాషల సినిమాలను చూస్తున్నారు సినీ ప్రేక్షకులు. అంతేకాదు కొత్త కొత్త కథల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇదే కారణంగా ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని సినిమాలు డిజాస్టర్లుగా మిగిలితున్నాయి.. పాత కథ మళ్ళీ తెరకెక్కిస్తూ అవసరం లేని హీరోయిజం చూపిస్తూ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఇక అలాంటి సినిమాలను ఘోరాతి ఘోరంగా తిరస్కరిస్తున్నారు సినీ అభిమానులు.

ఇలానే అక్కినేని ఫ్యామిలీ హీరోల సైతం వరుసగా నష్టపోతుండడం మనం చూస్తున్నాం. సీనియర్ హీరో నాగార్జున చేసిన సినిమాలను ప్రేక్షకులు ఎంతలా ఆదరిస్తారో మనందరికీ తెలిసిందే.ఇక ఆయన కుమారులు నాగచైతన్య అఖిల్ కూడా సినీ ఇండస్ట్రీకి హీరోలుగా పరిచయం అయ్యారు. అయితే నాగార్జున చేసిన సినిమాలు సినీ ప్రేక్షకులు ఆదరించారు. కానీ నాగార్జున కొడుకులు చేస్తే మాత్రం ఆదరించడం లేదు. ఇటీవల విడుదలైన కస్టడీ సినిమా డిజాస్టర్ గా నిలవడంతో అక్కినేని ఫ్యామిలీకి చెందిన ముగ్గురు హీరోలు కూడా వరుసగా డిజాస్టర్ లను చూస్తున్నారు. ఒకప్పుడు అయితే నాగార్జున చేసే సినిమాలు అంటే ఎగబడి చూసేవాళ్ళు జనాలు. ]

ఇప్పటికీ కూడా మళ్లీ మళ్లీ చూసేంత నచ్చుతాయి ఆ సినిమాలు కానీ గత కొంతకాలంగా నాగర్జున చేస్తున్న సినిమాలు జనాలకి అస్సలు నచ్చటం లేదు. స్క్రిప్ట్ ఎంపిక విషయంలో నాగార్జున తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదని తన అభిమానులు అంటున్నారు.సినిమాలు ఒక్కటే చేస్తే సరిపోదని కథ కూడా కరెక్ట్ గా ఎంచుకుంటే బాగుంటుందని అంటున్నారు. గతంలో ఆయన నటించిన వైల్డ్ డాగ్ ఆఫీసర్ ది గోస్ట్ సినిమాలన్నీ కూడా ఒకదాని తరువాత ఒకటి వరుసగా పరాజయం పాలయ్యాయి. తాజాగా ఇప్పుడు మళ్లీ నాగచైతన్య కి కూడా సరైన హిట్ లేదు. దీంతో రాబోయే రోజుల్లో అయినా అక్కినేని హీరోలు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నారు అక్కినేని ఫ్యాన్స్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: