
ముఖ్యంగా బిచ్చగాడు 2 మీద తెలుగు ఆడియన్స్ బజ్ అంతగా లేదన్నది తెలుస్తుంది. సినిమా చూడాలని ఆడియన్స్ అంత ఆసక్తిగా లేరు. అంతేకాదు సినిమా బిజినెస్ కూడా 7 కోట్లలోపే జరిగింది. బిచ్చగాడు హిట్ అయిన లెక్కలు చూస్తే ఇది చాలా తక్కువ అని చెప్పొచ్చు. కానీ ఈమధ్య తమిళ డబ్బింగ్ సినిమాలు తెలుగు బాక్సాఫీస్ పై సరిగా ఆడట్లేదు అందుకే బిచ్చగాడు 2ని కూడా తక్కువకే వదిలారు. అయితే హిట్ టాక్ వస్తే ఆ 7 కోట్లు పెద్ద కష్టమేమి కాదు కానీ టాక్ బాగాలేకపోతే మాత్రం చాలా కష్టమని చెప్పొచ్చు.
తెలుగు స్టార్ హీరోల సినిమాలకే మొదటి షో డిజాస్టర్ టాక్ వస్తే రెండో ఆటకే ఎవరు ఉండట్లేదు. అయితే బిచ్చగాడు 2 అలా అయ్యే పరిస్థితి లేదు. బిచ్చగాడు 1 కి 2కి సంబంధం లేకపోయినా ఈ సినిమాతో విజయ్ మళ్లీ గట్టి టార్గెట్ పెట్టుకున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ టైం లోనే భారీ యాక్సిడెంట్ తో చాలా రిస్క్ ఫేస్ చేశాడు. మరి ఆ కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుందా లేదా అన్నది చూడాలి. బిచ్చగాడు 2 తమిళ వర్షన్ కన్నా తెలుగులో ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందా అన్న ఎగ్జైట్ మెంట్ సినీ విశ్లేషకుల్లో ఉంది.