
ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. అయితే అల్లు అర్జున్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ అటు బుల్లితెరపై పలు కార్యక్రమాలలో కూడా సందడి చేస్తూ ఉంటాడు అదే సమయంలో ఇక సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించడం లాంటివి చేస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. టీవీ కార్యక్రమాలకు హాజరవ్వడం కాదు ఇక తనదైన శైలిలో పంచులు వేస్తూ కామెడీ పంచుతూ ఉంటాడు. తాను వెళ్లే బుల్లితెర షో సెట్ మొత్తం సందడి నెలకొనేలా చేస్తూ ఉంటాడు అల్లు అర్జున్. ఇటీవల ఒక టీవీ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో భాగంగా తన పర్సనల్ లైఫ్ గురించి కూడా ఎన్నో ఆసక్తికర విషయాలను అభిమానులతో షేర్ చేసుకున్నాడు.
తన మొదటి గర్ల్ ఫ్రెండ్ పేరు శృతి అని ఒక పెద్ద సీక్రెట్ బయటపెట్టాడు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్. అంతేకాదు దేవుడి గురించి తనకు ఉన్న అభిప్రాయాన్ని కూడా బయట పెట్టాడు. తనకు దేవుడు ఎలా ఉంటాడో తెలియదు అని.. కనిపించే దేవుడు మాత్రం మా నాన్న అంటూ చెప్పుకొచ్చాడు. ఇక పుష్ప లో కేశవగా నటించిన జగదీష్ ను వెంటనే పార్ట్ 2 షూటింగ్ కు హాజరు కావాలి అంటూ స్వీట్ గా వార్నింగ్ ఇచ్చాడు అల్లు అర్జున్. ఇకపోతే ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ ఎంతో శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన అల్లు అర్జున్ కు సంబంధించి మినీ టీజర్ అటు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది అని చెప్పాలి.