మహారాష్ట్ర రాజకీయాల్లో  ఎన్నికల ఫలితాలు వెలువడిన నుంచి తీవ్ర నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల ఫలితాలలో బిజెపి శివసేన కూటమి మ్యాజిక్ ఫిగర్  స్థానాల కంటే ఎక్కువ వచ్చినప్పటికీ శివసేన పార్టీ నాయకుడికి సీఎం సీటు ఇవ్వాలని కోరడంతో బిజెపి దానికి నిరాకరించడంతో శివసేన బీజేపీ పొత్తు విధించింది. దీంతో  మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభన ఏర్పడింది. దీంతో ఏ పార్టీ మద్దతుతో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాదో  అనేది మాత్రం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. అయితే అటు  శివసేన మాత్రం తమ పార్టీ నాయకుడు సీఎం సీటులో కూర్చోబెట్టాలని నిర్ణయించింది.  దీని కోసం ఎన్నో కసరత్తులు కూడా చేస్తుంది. ఇప్పటికే ఎన్సీపీ కాంగ్రెస్ మద్దతు కూడగట్టేందుకు శివసేన పార్టీ తీవ్ర కసరత్తులు చేస్తుంది. అయితే ప్రస్తుతం మహారాష్ట్ర లో రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న విషయం తెలిసిందే. 

 

 

 

 కాగా మహారాష్ట్రలో  ప్రభుత్వ ఏర్పాటుపై కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే చేసినట్లు . మహారాష్ట్రలో  బిజెపి శివసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అమిత్షా వ్యాఖ్యానించారని కేంద్ర మంత్రి అత్త వాళ్ళ తెలిపారట . ఇప్పటికే రెండు పార్టీల మధ్య విభేదాలు వచ్చి పొత్తు  కాస్త విభజించి వేరుపడిన  తరుణంలో మళ్లీ రెండు పార్టీలు కలుస్తాయని ధీమా వ్యక్తం తెలుస్తుంది . బిజెపి శివసేన మధ్య మధ్యవర్తిత్వం జరిపితే  సమస్యకు  పరిష్కారం దొరుకుతుందని ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అంటూ కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే అన్నారట . 

 

 

 

 ఇటీవల శివసేన తీరుపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికలకు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా తమకు ఆమోదయోగ్యం కాదని ఎందుకు చెప్పలేదని శివసేన పార్టీ ని ప్రశ్నించారు . ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎందుకు ఇలాంటి డిమాండ్ తెరపైకి తెచ్చారు అని ప్రశ్నించారు. ఇక తాజాగా బీజేపీ పై తీవ్ర ఆరోపణలు చేసింది శివసేన. తన ఎమ్మెల్యేలను కమలం నేతలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆరోపించింది. ఇప్పటికే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగుతుందని బిజెపి నేతలు తమ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నాలు  చేస్తున్నారంటూ ఆరోపించింది  శివసేన.

మరింత సమాచారం తెలుసుకోండి: