త్వరలోనే తెలంగాణ సీఎం గా కేటీఆర్ కు ప్రమోషన్ రాబోతోంది అనే సందడి టిఆర్ఎస్ పార్టీలో నెలకొంది. ఎమ్మెల్యేలు , మంత్రులు కీలక నాయకులు ఇలా అంతా కేటీఆర్ సీఎం పదవి గురించే చర్చ జరుగుతోంది. అప్పుడే కేటీఆర్ ను ప్రసన్నం చేసుకునేందుకు పెద్దఎత్తున నాయకులు కేటీఆర్ దృష్టిలో పడేందుకు హడావుడి చేస్తున్నారు. రాబోయే రథసప్తమి నాటి కి కేటీఆర్ తెలంగాణ సీఎంగా బాధ్యతలు అప్పగించేందుకు కేసీఆర్ ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. దీనిపై టిఆర్ఎస్ లో పండుగ వాతావరణం నెలకొంది.ఈ విషయంపై పెద్ద ఎత్తున దాసు మొదలైనా, అటు కేసీఆర్ గాని ,కేటీఆర్ కానీ ఈ విషయాన్ని ఖండించక పోవడంతో అది నిజమే అనే  అభిప్రాయం అందరిలోనూ నెలకొంది. ఇది ఇలా ఉంటే కేటీఆర్ కు సీఎం పదవి ఇస్తే మొదటి నుంచి కెసిఆర్ వెన్నంటే నడుస్తూ, పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు తన వంతు కృషి చేసిన ఆయన మేనల్లుడు హరీష్ రావు పరిస్థితి ఏమిటనే చర్చ ఇప్పుడు పార్టీలో మొదలైంది. 





ప్రస్తుతం కేటీఆర్ తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గా పనిచేస్తున్నారు. అలాగే టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సైతం నిర్వహిస్తున్నారు. ఆయనకు సీఎం పదవి వస్తే హరీష్ రావుకు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారనే హడావుడి మొదలైంది. ప్రస్తుతం తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ కి ప్రధాన రాజకీయ శత్రువుగా బీజేపీ మారిపోయింది అధికారం కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఆ పార్టీ స్పీడ్ ను తట్టుకుంటూ టీఆర్ఎస్ ను ముందుకు తీసుకువెళ్లాలి అంటే అది హరీష్ వల్లే సాధ్యం అవుతుంది  అనేది అందరి నమ్మకం.
పార్టీ దూకుడును అడ్డుకునేందుకు ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు కు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమోషన్ కల్పించే విషయంపై కెసిఆర్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: