
ఎన్నిక జరిగేదెన్నాడు అయితే ఇటీవల రాజీనామా చేసిన వెంటనే దాన్ని ఆమోదించడం, ఖాళీ గుర్తించి ఉప ఎన్నికకు నగర మోగడం స్పీడ్ గా జరిగిపోయాయి. రాజీనామా ఆమోదం రోజు నుంచి ఆరు నెలల్లోగా ఆ ప్రాంతంలో ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. జూన్ 12న రాజేందర్ అధికారికంగా తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఎన్నికల సంఘం వారు ఈ ఎన్నికల ప్రక్రియను డిసెంబర్ 11 లోపు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్టు మొదలైంది. డిసెంబర్లోగా ఎన్నిక జరుగుతుందని ఎవరికి నమ్మకం లేదు. ఇక్కడ మరొక ట్విస్టు కూడా ఉన్నది..
మమతాబెనర్జీ పోటీతో - ఈటల ఎన్నిక లింకా..
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మాత్రం ఘన విజయం సాధించిన మమతా బెనర్జీ తాను పోటీ చేసినటువంటి నందిగ్రామ్ లో మాత్రం ఓడిపోయారు. చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతోమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ కచ్చితంగా నవంబర్ 5లోగా చట్ట సభలోకి ఎన్ని కావలసి ఉంటుంది. దీనికోసం ఇప్పటి వరకే భవానీపూర్ సిద్ధం చేశారు. కానీ మమత ఎన్నిక నిర్దిష్ట సమయంలో జరుగుతుందా లేదా అనేది అనుమానాలకు తావిస్తోంది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వంలోని కొంతమంది ప్రముఖులు వైద్యనిపుణులు థర్డ్ వేవ్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గతంలో కూడా చెన్నై హైకోర్టు కోవిద్ సమయంలో ఆ ఐదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహించడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. ఎన్నికల సంఘాన్ని కూడా హెచ్చరించింది. దీంతో ఎన్నికల సంఘం దేశం మొత్తం ఖాళీగా ఉన్నటువంటి 17 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ సీట్లకు ఉప ఎన్నిక నిర్వహించే విషయంపై క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో ఏపీలోని బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. దీంట్లో వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యే మృతి చెందడంతో ఎన్నిక అనివార్యమైంది. దీనిపై జగన్ కి ఎలాంటి ఇబ్బంది లేదు.
ఇక్కడే మొదలైంది అసలు ఇబ్బంది. ఏమిటంటే హుజురాబాద్ లో అభ్యర్థి కోసం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈటెల మాత్రం మరింత తీవ్రంగా ప్రచారం కొనసాగిస్తున్నారు.