కాగ్.. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్.. ఇదో రాజ్యాంగబద్దమైన పదవి.. ఈ స్థానంలోఉన్నవారు ఇచ్చే నివేదికలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఏటా కాగ్ రిపోర్టు ఇస్తూనే ఉంటుంది. తాజాగా ఇచ్చిన కాగ్ నివేదికలో తెలుగుదేశం హయాంలో సాగిన పాలన తీరుకు సంబంధించి అనేక కీలక విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. ప్రత్యేకించి ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన అవకతవకలను బయటపెట్టినట్టు తెలుస్తోంది.

 

 

ప్రాజెక్టుల పనుల్లో తీవ్ర జాప్యం చేయడం వల్ల అంచనా వ్యయం భారీగా పెరిగిందని.. దీని వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాపై రూ.29,616.29 కోట్ల మేర భారం పడిందని కాగ్ సంస్థ అంచనా వేసింది. సాగునీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల వాటి ఫలాలు రైతులకు అందలేదని, ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని తీవ్రంగా దెబ్బ తీసిందని కాగ్ కామెంట్ చేసింది.

 

 

కాగ్ ఇంకా ఏమందంటే.. " గత సర్కార్‌ 27 సాగునీటి ప్రాజెక్టులపై రూ.43,031.61 కోట్లు ఖర్చు చేసినా ఏ ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేక పోయింది. పనుల్లో జాప్యం వల్ల ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.28,423. 64 కోట్ల నుంచి రూ.58,039.93 కోట్లకు పెరిగింది. దీనివల్ల ఖజానాపై రూ.29,616.29 కోట్ల మేర భారం పడిందని వివరించింది.

 

 

చింతలపూడి ఎత్తిపోతలకు సంబంధించి రూ.311.60 కోట్లు, తాడిపూడి ఎత్తిపోతలకు సంబంధించి రూ.113.28 కోట్లను ఖర్చు చేయకపోవడంతో నిష్ఫలమయ్యాయి. దీంతో పనులు సకాలంలో పూర్తి చేయలేకపోయారని కాగ్ వివరించింది. చంద్రబాబు హయాంలో జరిగిన ఈ జాప్యం కారణంగా రాష్ట్రంపై దాదాపు 30 వేల కోట్ల రూపాయల భారం పడిందన్నమాట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: