డిఫెండింగ్‌ చాంపియన్‌గా ఆస్ట్రేలియా ఓపెన్‌లో  బరిలోకి దిగి అత్యధిక సార్లు ఈ టైటిల్‌ గెలిచిన సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ ఒకవైపు.. గ్రాండ్‌ స్లామ్‌ టోర్నీల్లో మూడుసార్లు మాత్రమే ఫైనల్‌కు చేరిన ఆస్ట్రియా సంచలనం డొమనిక్‌ థీమ్‌ మరొకవైపు. దాంతో పోరు ఏకపక్షమే అనుకున్నారు.  కానీ జొకోవిచ్‌కు థీమ్‌ ముచ్చెమటలు పట్టించాడు. అభిమానుల మనసులను   దాదాపు నాలుగు గంటల పాటు పోరాడి గెలుచుకున్నాడు. చివరి వరకూ పోరాడి ఓడినా ఆద్యంతం ఆకట్టుకున్నాడు.  

 

చిన్నచిన్న పొరపాట్లు థీమ్‌ ఓడేలా చేస్తే.. అనుభవాన్ని ఉపయోగించి కడవరకూ రేసులో ఉన్న జొకోవిచ్‌ మరోసారి టైటిల్‌ గెలుచుకున్నాడు. ఈ రోజు జరిగిన పురుషుల ఫైనల్‌ పోరులో జొకోవిచ్‌ 6-4, 4-6, 2-6, 6-3, 6-4 తేడాతో థీమ్‌పై గెలిచి టైటిల్‌ను సాధించాడు. ఇది జొకోవిచ్‌ ఎనిమిదో ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిల్‌ కాగా, ఈ టోర్నీలో థీమ్‌కు ఇదే తొలి ఫైనల్‌. 


జొకోవిచ్‌ ప్రస్తుతం తొలి సెట్‌ను గెలిచి మంచి ఊపు మీద ఉన్నాడు .. ఇక రెండో సెట్‌ను చేజార్చుకున్నాడు. అద్భుతమైన ఏస్‌లతో చెలరేగిన థీమ్‌ రెండో సెట్‌ను  జొకోవిచ్‌ అవలీలగా గెలిచాడు. ఇక  అదే ఊపును మూడో సెట్‌లో కూడా కనబరిచి జొకోవిచ్‌పై పైచేయి సాధించాడు. దాంతో నాలుగు, ఐదు సెట్లను గెలవాల్సిన పరిస్థితికి జొకోవిచ్‌కు ఎదురైంది. కీలక సమయంలో ఎదురునిలిచిన జొకోవిచ్‌ ఎటువంటి పొరపాట్లు చేయలేదు.

 

ఒక్కో పాయింట్‌ సాధిస్తూ సెట్‌ను గెలుచుకున్నాడు. ఇక రేసులోకి వచ్చేశాడు. ఇక మ్యాచ్‌ నిర్ణయాత్మక ఐదో సెట్‌లో జొకోవిచ్‌ మిక్కిలి శ్రమించాడు. ఈ సెట్‌లో ఇద్దరి స్కోరు సమంగా ఉన్న దశలో జొకోవిచ్‌ తనలోని అసలైన ఆటను బయటకు తీశాడు. థీమ్‌ను వెనక్కి నెడుతూ ఆ సెట్‌తో పాటు ఆస్ట్రేలియా ఓపెన్‌ అంటేనే తనదనే విషయాన్ని మరోసారి నిరూపించుకున్నాడు.కాగా, ఆస్ట్రేలియా ఓపెన్‌లో జొకోవిచ్‌ (2020, 2019, 2016, 2015, 2013, 2012, 2011, 2008)ఫైనల్‌కు చేరిన ఎనిమిది సార్లూ విజేతగా నిలవడం మరో విశేషం.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: