సాధారణంగా స్టార్ సెలబ్రిటీస్ బయట ఎక్కువగా తిరగడానికి ఇష్టపడరు . మరీ ముఖ్యంగా ఇండియాలో తిరగడానికి అస్సలు ఇష్టపడరు . ఇండియాలో వాళ్ళంటే ప్రతి ఒక్కరికి తెలుసు.  బయటకు వస్తే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్.  బయట ఎక్కడికి వెళ్ళినా సరే ఆటోగ్రాఫ్ లు ఫోటోగ్రాఫర్లు అంటూ ఎగబడిపోతూ ఉంటారు . వాళ్ల వల్ల సెక్యూరిటీ చాలా టైట్ చేయాల్సి వస్తుంది. సెక్యూరిటీ టైట్ చేస్తే సోషల్ మీడియాలో లేనిపోని రాద్ధాంతం.  ఇదంతా ఎందుకు అని సరదాగా గడపాలి అన్న ఎంజాయ్ చేయాలి అన్న స్టార్ సెలబ్రెటీస్ ఎక్కువగా ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళిపోతూ ఉంటారు .


అక్కడే ఫ్యామిలీతో రోజులకి రోజులు బాగా ఎంజాయ్ చేసి తిరిగి ఇండియా వస్తూ ఉంటారు .  కొంతమంది సెలబ్రిటీలు అయితే మరీ దారుణం గుడికి వెళ్లాలన్నా సరే సెక్యూరిటీ పేరిట నానా హంగామా చేస్తూ ఉంటారు . అందరూ ఇలానే ఉంటారా..? అంటే నో అని చెప్పాలి . కొంతమంది డబ్బున్న వ్యక్తులు చాలా సింపుల్ లైఫ్ స్టైల్ ను ఎంజాయ్ చేస్తూ ఉంటారు . మరి ముఖ్యంగా గుడికి వెళ్ళాలి అంటే ప్రశాంతంగా వెళ్లడానికి ఇష్టపడతారు . వాళ్ళ స్టార్ స్టేటస్ అంతా పక్కన పెట్టేసి ప్రశాంతంగా సామాన్య జనంలా దేవుడిని దర్శించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు .



వాళ్లలో ఒకరే ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ . వాళ్లకి ఎన్ని వేల కోట్ల ఆస్తి ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  అయినా  సరే ఆమె  సింపుల్ లైఫ్ స్టైల్ అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది . తాజాగా నీతా అంబానీ హైదరాబాద్ నగరం లో బల్కంపేట అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు.  హైదరాబాద్ ఎప్పుడొచ్చినా సరే నీతా అంబానీ అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటుంది . మరి ముఖ్యంగా ఆషాడమాసం రాబోతుంది . భాగ్యనగరం బోనాలు సంబరాలకు రెడీ అవుతుంది . ఈ క్రమంలోనే నీతా అంబానీ బల్కంపేట అమ్మవారి ఆలయాన్ని సందర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది . అంతేకాదు ఎల్లమ్మ పోచమ్మకి నీతా అంబానీ కోటి రూపాయల విరాళాలని అందజేశారు . ఈ విరాళం బుధవారం రోజున దేవస్థానం బ్యాంక్ ఖాతాలో జమ అయ్యింది . ఇదే విషయాన్ని ఈవో మహేందర్ గౌడ్ చెప్పారు. అంత స్టార్ స్టేట్స్ ఉన్న వ్యక్తి ఇలా సింపుల్ గా గుడి రావడం..భతి శ్రద్ధలతో పూజలు చేయంద.. ఆలయ విశిష్ట అడిగి తెలుసుకోవడంతో అక్కడ ఉన్న భక్తులు షాక్ అయ్యారు. డబ్బున్న వాళ్లౌ ఇలా కూడా ఉంటారా..? అని నీతా అంబానీ మంచితనానికి ఫిదా అవుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: