ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా కంపెనీ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చిన అధునాతన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మహీంద్రా ఎక్స్‌యూవీ400 ని కంపెనీ నేడు (సెప్టెంబర్ 8, 2022) అధికారికంగా లాంచ్ చేసింది.మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ చాలా స్టైలిష్ అండ్ కాంపాక్ట్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇంటీరియర్ కూడా చాలా నీట్‌గా సింపుల్‌గా ఉంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ బుజ్జి ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ పూర్తి బ్యాటరీ చార్జ్ పై భారతీయ డ్రైవింగ్ పరిస్థితులలో (MIDC) 456 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. భారత మార్కెట్లో మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అమ్మకాలు జనవరి 2023లో స్టార్ట్ కానున్నాయి.ఎక్స్‌యూవీ400 కేవలం 8.3 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. అలాగే, ఇది గంటకు 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడానికి కేవలం 4 సెకన్ల సమయం మాత్రమే పడుతుంది. ఇక టాప్ స్పీడ్ విషయానికి వస్తే, ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ గరిష్టంగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.


మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 147.5 బిహెచ్‌పి మాక్సిమం పవర్ ను ఇంకా 310 ఎన్ఎమ్ మాక్సిమం టార్క్‌ ను ఉత్పత్తి చేసే ఒక పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్‌ ఉంటుంది. ఇది కారులో అమర్చిన శక్తివంతమైన 39.5kWh బ్యాటరీ ప్యాక్ సాయంతో పనిచేస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్ ఇండియన్ డ్రైవింగ్ సైకిల్ (MIDC) ప్రకారం, పూర్తి ఛార్జింగ్‌ పై456 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది. దుమ్ము ఇంకా నీటి నిరోధకత కోసం ఈ బ్యాటరీ ప్యాక్ IP67 రేటింగ్ ను కూడా పొందింది.మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 3 రకాల డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. వీటిలో ఫన్, ఫాస్ట్ మరియు ఫియర్‌లెస్ అనే డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. మహీంద్రా ఇందులో అతుకులు లేని డ్రైవింగ్‌ను అనుమతించే 'లైవ్లీ' అనే సింగిల్ పెడల్ డ్రైవ్ మోడ్‌ను కూడా అందిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: