తెలుగుదేశం అధినేత చంద్రబాబు గుంటూరు, బాపట్ల జిల్లాలో పర్యటించబోతున్నారు. మూడు రోజుల పాటు ఈ పర్యటన ఉంటుంది. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పేరుతో ఇప్పటికే చంద్రబాబు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించారు. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు గుంటూరు, బాపట్ల జిల్లాలో పర్యటిస్తారు. గుంటూరు జిల్లా పొన్నూరులో నేడు, బాపట్ల జిల్లా బాపట్లలో రేపు, బాపట్ల జిల్లా చీరాలలో 10వ తేదీన చంద్రబాబు పర్యటన ఉంటుంది. ఈ మూడు రోజుల్లో మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు.

మధ్యాహ్నం ఒంటిగంటకు ఉండవల్లి నివాసం నుంచి చంద్రబాబు రోడ్ షో నిర్వహిస్తారు. రాత్రికి పొన్నూరు చేరుకుంటారు. పెదకాకాని నుండి పొన్నూరు నియోజకవర్గ ఇన్చార్జి దూళిపాళ్ల నరేంద్ర భారీ బైక్ ర్యాలీని ఏర్పాటు చేశారు. నారా కోడూరులో  రైతులతో చంద్రబాబు సమావేశం అవుతారు. పొన్నూరు బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని రాత్రికి పొన్నూరులోనే బస చేస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: