పెళ్లి అనే బంధంతో ఒక్కటై కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన దంపతులు ఎవరైనా సరే ఇక పిల్లలను కని తల్లిదండ్రులుగా మారాలని ఎంతగానో ఆశ పడుతుంటారు అని చెప్పాలి. అయితే ఇక ఇలా తమకు పిల్లలు పుట్టిన తర్వాత ఆ ఆనందం మాటల్లో వర్ణించలేని విధంగా ఉంటుంది. అయితే ఇలా పిల్లలు పుట్టారు అన్న ఆనందం  మూన్నాళ్ళ ముచ్చటగా మిగిలితే ఆ తల్లిదండ్రులు అరణ్య రోదనగా వినిపించాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అని చెప్పాలి. కొంతమంది విషయంలో ఇలాంటి విషాదకర ఘటనలే జరుగుతూ ఉంటాయి. అనుకోని ఘటనలు చివరికి అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిల్లల ప్రాణాలను తీసేస్తూ ఉంటాయని చెప్పాలి.


 ఇక్కడ ఒక తల్లికి ఇలాంటి వర్ణనాతీతమైన బాధ ఎదురైంది. దీంతో మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంది ఆ తల్లి. కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన లీజ అనే 38 ఏళ్ల మహిళ తన కుమారుడు భర్తతో కలిసి ఉంటుంది. అయితే ఇటీవల ఆమెకు మరో పండంటి మగ బిడ్డ పుట్టాడు. అయితే రోజు లాగానే ఇటీవల తన కొడుక్కి ఆమె పాలు ఇచ్చింది. అయితే చనుబాలు గొంతులో ఇరుక్కోవడంతో ఆ పసికందు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ తల్లి తట్టుకోలేకపోయింది. పుట్టిన 28 రోజులకే ఇక కొడుకు చనిపోవడంతో ఏకంగా ఆమె గుండె బద్దలైంది.


 దీంతో ఇంట్లో ఉన్న ఏడేళ్ల రెండో కుమారుడితో కలిసి ఇంటి ప్రాంగణంలో ఉన్న 40 అడుగుల బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది ఆ తల్లి. ఇక ఎవరు గమనించకపోవడంతో చివరికి ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు అని చెప్పాలి. కాగా లిజ ఆల్ కొడై సర్వీస్ కో-ఆపరేటివ్ బ్యాంకులో మేనేజర్ గా పనిచేస్తుంది. లిజాకు పుట్టిన మొదటి కొడుకు రెండేళ్ల క్రితం అనారోగ్య సమస్యల కారణంగా చనిపోయాడు. ఇక ఇప్పుడు మూడో కొడుకు కూడా ఇలాగేదూరం కావడంతో ఆమె తట్టుకోలేక ఇక ఇలా ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు పోలీసులకు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: