నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇటీవల ప్రధాని మోదీ మాట్లాడుతూ..  పార్లమెంట్ సభ్యుల సంఖ్య పెరుగుతుందన్నారు. కానీ అది ఇప్పుడు కాదు 2026 తర్వాతనే అని తెలుస్తోంది. ఎంపీ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2029 నాటికి అది అమల్లోకి రానుంది. అంటే 2024 ఎన్నికల్లో పాత ఎంపీ స్థానాల్లోనే ఎన్నికలు జరగనున్నాయి.


అసెంబ్లీ ఎన్నికలకు మాత్రం 20 ఏళ్లకు ఒక సారి పునర్విభజన చేస్తున్నారు. ఇందులో భాగంగానే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన సమయంలో హైదరాబాద్ లో రెండు సీట్లకు పరిమితమైన ఎంఐఎం 7 సీట్ల వరకు గెలిచేలా కాంగ్రెస్ అనుకూలంగా ఓట్లను డివైడ్ చేసిందనే ఆరోపణలు ఉన్నాయి.  హిందువుల ఓట్లను ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు డివైడ్ చేసి ఎంఐఎం పార్టీ అభ్యర్థులు గెలిచేలా చేశారని వైఎస్ పై ఆనాడు ఆరోపణలు వచ్చాయి.


ఆంధ్రప్రదేశ్ లో కూడా పత్తి పాటి పుల్లారావు, దేవినేని రమణ గెలిచిన నియోజకవర్గాలను ఎస్సీ స్థానాలుగా మార్చి వారి ప్రాభవాన్ని తగ్గించారు. ఇలా ప్రతిపక్ష పార్టీల బలమైన నేతల నియోజకవర్గాల్లో మార్పులు చేశారు. మళ్లీ  2024 తర్వాత ఎవరూ అధికారంలోకి వస్తారో వారికి అనుకూలంగా సీట్లను మలుచుకునే అవకాశం ఉంటుంది.


అయితే పార్లమెంటులోని పాత లోక్ సభలో 552 మంది మాత్రమే కూర్చునే అవకాశం ఉండగా..  నూతన లోక్ సభ లో 882 మంది కూర్చునేలా తీర్చిదిద్దారు. ఉభయ సభలు సమావేశం అయినపుడు 1272 మంది లోక్ సభ చాంబర్ లోనే కూర్చునేలా దీన్ని కట్టారు. పాత పార్లమెంటు భవనాన్ని1921 లో నిర్మించారు. 2029 లో ఎంపీల నియోజకవర్గాల పునర్విభజన జరిగితే పాత పార్లమెంటులో కూర్చోవడానికి  ఇబ్బందిగా ఉంటుంది. అందులో పాత పార్లమెంటు భవనాన్నికట్టి వందేళ్లు అవుతోంది. నూతన పార్లమెంటు భవనం పూర్తిగా అన్ని సౌకర్యాలతో నిర్మించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: