సినీ హీరోయిన్ల తో క్రికెటర్ల ప్రేమాయణం కొత్తేమి కాదు. కానీ ఆ జాబితా లో ఇప్పుడు మరొక క్రికెటర్ వచ్చి  చేరాడు . టీమిండియా ఓపెనర్ కె ఎల్ రాహుల్ బాలీవుడ్ భామ తో పీకల్లోతు ప్రేమాయణం లో ఉన్నాడు . వీరిద్దరూ గత కొంత కాలంగా డేటింగ్ కూడా చేస్తున్నారట . ఇప్పటికే మరొక టీమిండియా క్రికెటర్ బుమ్రా,  మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు కథనాలు వెలువడిన విషయం తెల్సిందే . 


ఇప్పుడు మరొక యువ క్రికెటర్ ప్రేమాయణం  వెలుగులోకి రావడం హాట్ టాఫిక్ గా మారింది . ఇంతకూ కె ఎల్ రాహుల్ ప్రేమించింది ఎవర్నో తెలుసా ... ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి ని . అతియా , ఆదిత్య పంచోలి తనయుడు సూరజ్ పంచోలి హీరోగా తెర కు ఎక్కిన హీరో చిత్రం ద్వారా బాలీవుడ్ కు పరిచయం అయింది . ప్రస్తుతం చేతిలో సినిమాలు లేకపోవడం తో, కె ఎల్ రాహుల్ తో పీకల్లోతు ప్రేమాయణం లో మునిగి తేలుతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ అత్యంత సన్నిహితంగా ఉన్న ఫొటో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది . దాంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందన్న పుకార్లు, షికార్లు చేస్తున్నాయి .


ఐ పి ఎల్ అద్భుత ప్రదర్శన ద్వారా ప్రపంచ కప్  జట్టు లో  చోటు దక్కించుకున్న రాహుల్ , శిఖర్ ధావన్ గాయపడడం తో ప్రస్తుతం ఓపెనర్ గా మంచి ఆటతీరును కనబరుస్తున్నాడు . మైదానం లో అభిమానులను అలరిస్తున్న ఈ యువ క్రికెటర్ , అతియా శెట్టి తో  డేటింగ్ , ప్రేమాయణం గురించి ఏమి చెబుతాడన్నది ఆసక్తికరంగా మారింది . 


మరింత సమాచారం తెలుసుకోండి: