మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రవితేజ ఇప్పటికే ఈ సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. మొదటగా రవితేజ ఈ సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమాలో కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ లో రవితేజ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ ఈ సినిమా విజయంలో చాలా కీలక పాత్రను పోషించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ హీరో సుదీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన రావణాసుర అనే మూవీ లో హీరో గా నటించాడు.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రవితేజ "టైగర్ నాగేశ్వరరావు" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో రవితేజ దొంగ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తి అయింది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను మే 24 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.

అందులో భాగంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఒక్కో భాషలో ఒక్కో హీరో విడుదల చేయబోతున్నాడు. ఈ మూవీ యొక్క తెలుగు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విక్టరీ వెంకటేష్ విడుదల చేయనుండగా , తమిళ్ లో కార్తీ , కన్నడ లో శివరాజ్ కుమార్ , మలయాళం లో దుల్కర్ సల్మాన్ , హిందీ లో జాన్ అబ్రహం విడుదల చేయనున్నాడు. ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: