
ఇటీవలే ధనుష్ సార్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. తెలుగులో కూడా మంచి పాపులారిటీ సంపాదించారు. ఈ నేపథ్యంలోనే తన 50వ సినిమాకు సంబంధించి చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు ఈ చిత్రాన్ని సన్ పిక్చర్ బ్యానర్ నిర్మిస్తున్నారు. ఇక ఇందులో హీరో దుశర విజయన్ , ఎస్ జె సూర్య, విష్ణు విశాల్, కాళిదాసు కూడా నటిస్తున్నారు వారితోపాటు హీరో సందీప్ కిషన్ కూడా కీలకమైన పాత్రలు నటిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా సందీప్ కిషన్ అయితే ఈ చిత్రంలో తన పాత్రకు న్యాయం చేయగలరని భావించి ధనుష్ స్వయంగా ఈ హీరో పేరు సజెషన్ చేసినట్టుగా సమాచారం.
మరి ఇందులో తన పాత్ర ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి రామన్ అనే టైటిల్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ఫ్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతోంది ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తూ ఉన్నారు. నేటి వల కాలంలో సందీప్ కిషన్ ఒక హర్రర్ చిత్రంలో కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది.