మసూద చిత్రంతో మంచి సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న నటుడు తిరువీర్ ముఖ్యమైన పాత్రలో నటించిన చిత్రం పరేషాన్.. ఈ చిత్రం చాలామంది కొత్త వాళ్ళతో తెరకెక్కించిన ఈ సినిమా ఈ రోజున విడుదల కావడం జరిగింది. ఈ సినిమా రానా దగ్గుబాటి రిలీజ్ చేయడం గమనార్హం.. చిన్న సినిమాని రానా రిలీజ్ చేస్తూ ఉండడంతో ప్రమోషన్స్ కూడా భారీగా చేశారు.అక్కడ ఇక్కడ కొన్నిచోట్ల ఈ సినిమా ప్రీమియర్ షోలో పడడం జరిగింది. ఈ సినిమా మరి ప్రేక్షకులను మెప్పించింది లేదు ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

పరేషాన్ సినిమా కథ విషయానికి వస్తే తిరువిర్ తండ్రీ సింగరేణిలో ఉద్యోగం చేస్తూ కష్టపడుతూ ఉంటాడు.. అయితే తండ్రి కష్టపడుతున్న తిరువరన్ మాత్రం దోస్తులతో తిరుగుతూ చదువు మీద దృష్టి పెట్టేవారు కాదు.. ఐఐటి ఫెల్ అవుతూ ఉంటారు తిరువిర్ తన ఉద్యోగం కుమారుడికి రావాలంటే డబ్బులు కట్టాలని తన భార్య చెబితే బంగారు గాజులు అమ్మి మరి కొడుకు చేతిలో పెడతారు.. కానీ తన కొడుకు మాత్రం ఆ డబ్బంతా దోస్తులకు ఖర్చు పెట్టేస్తారు షికారులకు తోడు శిరీష అనే అమ్మాయి ప్రేమలో పడి.. ఆమెతో శారీరక సంబంధం వరకు వెళ్తారు. ఒకరోజు ఆమెకు వాంతులు కావడంతో ప్రెగ్నెంట్ అని చెప్పి గాబర పడుతూ ఉండడంతో దోస్తులు పట్నం పోయి పరీక్షలు చేయించుకో రమ్మని పైసలు ఇస్తారు.. ఆ తర్వాత ఏమైంది.. తన తండ్రికి నిజం తెలిసి ఏం చేస్తారు అనే కదా అంశంపై చిత్రాన్ని తెరకెక్కించారు.


 ఈ సినిమా తెలంగాణ మీద ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో విడుదలైన చిత్రాలు మాత్రం ఈ సినిమా కూడా పరేషాన్ చేస్తోంది. కామెడీ పరంగా ఎమోషనల్ పరంగా ప్రతి సిను కూడా హైలెట్ గా ఉందని నటుడు తిరువిర్ అయితే తన పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తూ నటించారని.  శిరీష పాత్రలో పావనికరణం చక్కగా నటించిందని కామెంట్ చేస్తున్నారు. థియేటర్లోకి వెళితే ఫుల్ మస్తు సినిమా అన్నట్టుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు వైరల్ గా మారుతున్నాయి. ఎట్టకేలకు తిరువీర్ మంచి విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: