
పార్లమెంటులో ఈరోజు ఉదయం 11 గంటలనుంచి శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. కాగా బిజెపి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక రెండో సారి శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. 17 వ లోక్ సభలో రెండోసారి ఈ శీతాకాల సమావేశాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే అధికార బీజేపీ తీసుకున్న పలు కీలక నిర్ణయాలపై ప్రతిపక్షాలు నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ శీతాకాల సమావేశంలో పౌరసత్వ బిల్లు తో పాటు పలు కీలక బిల్లులు చర్చకు రానున్నాయి. కాగా ఈ శీతాకాల సమావేశాలు 20 రోజుల పాటు జరుగనున్నాయి. శీతాకాల సమావేశాల్లో మొత్తం 27 బిల్లులను ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం దేశం మొత్తం ఈ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి బిల్లులు ప్రవేశపెట్టిన ఉందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ సిగరెట్ల తయారీ నిల్వ అమ్మకాలను నిలిపివేయడానికి కీలక బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం నిర్ణయించింది .
మొత్తం కేంద్ర ప్రభుత్వం 27 కీలక బిల్లులను శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం ఇరవై రోజుల పాటు ఈ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఎక్కువగా ప్రజా సమస్యలను చర్చించేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తామని ప్రధాని మోడీ తెలిపారు. ఈనెల 26న ప్రత్యేక రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా లోక్ సభ, రాజ్యసభ సభ్యులు కలిసి సంయుక్తంగా సమావేశం నిర్వహించనున్నారు. వచ్చే నెల 23 వరకు ఈ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. కాగా కాశ్మీర్ అంశం రాఫెల్ అంశం ఆర్థిక మందగమనం పై నిలదీసేందుకు ప్రతిపక్షాలన్నీ అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉన్నాయి.
అంతే కాకుండా ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న ఉమ్మడి సమావేశంలో ఎలాంటి బిల్లు ఆమోదం పొందుతుందని దానిపై ఆసక్తి నెలకొంది. ఇక 17 వ లోక్ సభలో రెండోసారి శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ప్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టె మొత్తం 27 కీలక బిల్లులలో పార్లమెంట్ లో ఏ ఏ బిల్లులు ఆమోదం ముద్ర వేస్తాయో తెలియాల్సి ఉంది. అంతేకాకుండా పార్లమెంట్ సభ్యులు ఆయా రాష్ట్రాల ప్రయోజనాలకు సంబంధించిన పార్లమెంటులో చర్చించేందుకు సిద్ధం చేశారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల పార్లమెంటు సభ్యులను ఆయా పార్టీల అధ్యక్షులు పార్లమెంటులో లేవనెత్తాల్సిన అంశాలపై పలు కీలక వ్యూహాలను సూచనలను ఎంపీలకు చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఈ శీతాకాల సమావేశాలలో ఎలాంటి అంశాలు తెరమీదికి రాబోతున్న అనేది వేచి చూడాలి.