తెలంగాణాలో బిజెపి నేతలు మహిళా దినోత్సవ వేడుకలను చాలా ఘనంగా నిర్వహించారు. మహిళా దినోత్సవం నాడు తెలంగాణ మహిళ మంత్రులపై బీజేపీ నేత ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.  సబిత, సత్యవతి రాథోడ్ లు మంత్రిహోదాలో ఆఖరి మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారంటూ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వ్యాఖ్యలు చేసారు. కల్వకుంట్ల కవిత కోసం మంత్రి పదవులు త్యాగం చేయటానికి సబిత, సత్యవతి రాథోడ్ లు సిద్దంకావాలి  అని ఆయన వ్యాఖ్యలు చేసారు. పద్మాదేవేందర్ రెడ్డికి టీఆర్ఎస్ లో మరోసారి అన్యాయం జరగబోతోంది అని హెచ్చరించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల కోసం టీఆర్ఎస్ రెండు వర్గాలుగా విడిపోయింది  అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. అసదుద్దీన్, కేటీఆర్ లు ప్రొఫెసర్ నాగేశ్వర్ గెలుపు కోసం కృషి చేస్తున్నారు అని అన్నారు. వెట్టి చాకిరీ హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డిలు వాణీదేవి కోసం పనిచేస్తున్నారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. ఎంఐఎం ను మచ్చిక చేసుకోవటానికే కేటీఆర్ బీజేపీపై విమర్శలు చేస్తున్నారు అని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత CMOలో జరుగుతోన్న అవినీతిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం అని పేర్కొన్నారు.

కేసీఆర్ కు బ్రాహ్మణులపై నిజంగా ప్రేమ ఉంటే మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు అని నిలదీశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేటీఆర్ సహా మంత్రులు ఓటర్లను బెదిరిస్తున్నారు. ప్రలోభాలకు గురిచేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. బ్రాహ్మణ కార్పోరేషన్ కు కేటాయించిన వంద కోట్లు ఖర్చు చేయలేని అసమర్థ కేసీఆర్ ప్రభుత్వం అని ఆరోపించారు. బ్రాహ్మణులు ఎదగటం ఇష్టం లేకమే EWS రిజర్వేషన్లను కేసీఆర్ అమలు చేయటం లేదు అని ఆయన ఆరోపించారు. వెయ్యి కోట్లు ఇస్తామని ఎంబీసీలను మోసం చేశారు. ఎంబీసీలను గుర్తించటంలో ప్రభుత్వం విఫలం అని అన్నారు. వంచించటం, మోసం చేయటంలో కేసీఆర్ ను మించినోడు లేడు అని అన్నారు. న్యాయవాదులు, జర్నలిస్టులపై కేటీఆర్ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు అని ఆయన చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: