ఈ రోజు ఉద‌యం నుండి టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వ‌ర్ రావు ఇంట్లో ఈడీ సోదాలు నిర్వ‌హించింది. నామా నాగేశ్వ‌ర్ రావు హైద‌రాబ్ నివాసం తో పాటు ఖ‌మ్మంలోని నివాసంలో కూడా ఈడీ సోదాలు చేసింది. అంతే కాకుండా ఆయ‌న‌కు సంబంధించిన అన్ని కార్యాల‌యాల్లో రైడ్స్ జ‌రిగాయి. 2011 లో రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే ప్రాజెక్ట్ నామా నాగేశ్వ‌ర్ రావు చెందిన మ‌దుకాన్ కంపెనీకి వ‌చ్చింది. అయితే ఆ ప్రాజక్టును పూర్తి చేయ‌గానికి గాను ముదుకాన్ కెనరా బ్యాంక్ తో పాటు ప‌లు బ్యాంకుల నుండి మొత్తం రూ. 1100 కోట్లు లోన్ ను తీసుకున్నారు. అందులో 264 కోట్లు రూపాయల నిధులు పక్క దారి పట్టించునట్టు మదుకన్ కంపెనీ పై అభియోగాలు ఉన్నాయి. నిధుల మళ్లింపు పై 2019 లో సీబీఐ కేసున‌మోదు చేసింది. 

రాంచీ ఎక్సె ప్రెస్ హైవే ప్రాజెక్ట్ పూర్తి చేయకపోవడం పై రాంచీ హై కోర్టుకు పలు పిటిషన్  లు వ‌చ్చాయి. ఈ ప్రాజెక్ట్ స్కాం పై విచారణ చేయాలని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ అధికారులకు ఝార్ఖండ్ హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ విచారణ లో మదుకాన్ ప్రాజెక్ట్ నుండి నిధులు మదుకాన్ ఇన్ఫ్రా , మాదుకాన్ టోల్ హై వే లకు మల్లించినట్టు సీబీఐ అధికారులు నివేధిక‌లో పేర్కొన్నారు. ఇక ఇప్పుడు అదే కేసు మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలోనే నామా ఇండ్ల‌పై మ‌రియు ఆఫీసులపై దాడులు జ‌రుగుతున్నాయి. దాంతో టీఆర్ఎస్ పార్టీలో కూడా  ప్ర‌కంప‌ణ‌లు మొద‌ల‌య్యాయి.

నామా నాగేశ్వ‌ర్ రావు ఇంట్లో ఈడీ సోదాలు నిర్వ‌హిస్తే టీఆర్ఎస్ లో ఎందుకు ప్ర‌కంప‌ణ‌లు మొద‌ల‌వుతాయ‌ని అనుమానం అక్క‌ర్లేదు. గ‌త కొద్ది రోజులుగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి బండి సంజ‌య్ వారం రోజుల్లో టీఆర్ఎస్ నాయ‌కులు మ‌రియు కేసీఆర్ కుంటుంబీకుల అవినీతి చిట్టా భ‌య‌ట‌పెడ‌తామ‌ని హెచ్చ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. బండి సంజ‌య్ హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డం..ఈ రోజు నామా నాగేశ్వ‌ర్ ఇంట్లో సోదాలు జ‌ర‌గ‌డం చూస్తుంటే మోడీ ప్ర‌భుత్వమే దాడులు చేయింద‌ని నాయ‌కులు భ‌య‌ప‌డుతున్నారు.

అంతే కాకుండా లోక్‌సభలో టిఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న నామాపై ఈడీ దాడులు జ‌ర‌ప‌డంతో టీఆర్ఎస్ కు ద‌గ్గ‌రగా ఉన్న పారిశ్రామిక వేత్త‌లు మ‌రియు టీఆర్ఎస్ నాయ‌కులపై కూడా దాడులు జ‌రిగే అవ‌కాశం లేక‌పోలేద‌ని అనుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్, కర్ణాటక ఇత‌ర రాష్ట్రాల్లో మాదిరిగా ప్ర‌తిప‌క్షాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని సీబీఐని ఆయుదంగా మార్చుకుని ఈడీ ఈ దాడుల‌కు పాల్ప‌డుతోందుంని విశ్లేష‌కులు అభిప్రాయం వ‌క్తం చేస్తున్నారు. అంతే కాకుండా తెలంగాణ‌లో బీజేపీ దూకుడు చూస్తుంటే కేసీఆర్ స‌న్నిహితులు ఆయ‌న కుటుంబ స‌భ్యుల ఇళ్ల‌పై కూడా త్వ‌ర‌లోనే దాడులు జరిగే అవ‌కాశం ఉన్న‌ట్టు క‌నిపిస్తుంది. అంతే కాకుండా బండి సంజ‌య్ హెచ్చ‌రించిన‌ట్టుగా జైలుకు పంపడం కూడా ఖాయ‌మే అనిపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: