ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పార్టీ పుంజుకోకూడదు, ఒక్కసారి చరిత్ర చూస్తే, ఆ పార్టీ అడుగు పెట్టిన ప్రతి రాష్ట్రంలో ఇతర పార్టీలు గతిలేకుండా పోయాయి. అందుకే దాదాపుగా ఏపీలో ఆ పార్టీ లేకుండా ఉంటె బాగుండు అనుకుంటున్నారు. ఈ భావజాలం ఒక్క ఏపీకి మాత్రమే కాదు, ప్రస్తుతం మొత్తం  దేశంలో వ్యాపింపజేయడానికి విపక్షాలు, వారి అనుకూల మీడియా కూడా తీవ్రంగానే ప్రయత్నిస్తున్నాయి. ఎవరి ఆసక్తిని వాళ్ళు చెప్పడం తప్పేమి కాదు. కానీ అంతా కలిసి ఒకదానిపై పడటం మాత్రం సబబు కాదు. బీజేపీ ప్రయాణాన్ని గమనిస్తే, పశ్చిమ బెంగాల్ లో చూసుకుంటే ఐదో స్థానం నుండి ప్రతిపక్షంగా రెండో స్థానంలో కూర్చుంది. అలాగే ఒడిశా లో కూడా నాలుగో స్థానంలో ఉన్నది కాస్తా రెండో స్థానంలోకి వచ్చేసింది, ఉత్తరప్రదేశ్ లో కూడా ఆరో స్థానంలో ఉండాల్సినది ఏకంగా ఇప్పుడు ప్రభుత్వంలోనే ఉన్నది.

ఇదే పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాలలో రాకూడదు అనే ఆలోచనతో ఆయా పార్టీలు వారి అనుకూల మీడియా బీజేపీపై తీవ్రంగా వ్యతిరేక ప్రచారం చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణలో స్వయంగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. అలాగే ఏపీలో కూడా అటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అలాగే తాజాగా హోదా విషయంపై నీతి ఆయోగ్ సిఫారసుల విషయంలో వ్యతిరేక ప్రచారం సాగుతూనే ఉంది. మీడియా నుండి అన్ని పార్టీలు కూడా బీజేపీ ని ఎదగకుండా చూస్తున్నాయి. దీనితో టీడీపీ తో కలిసి నడిచేందుకు సిద్ధం అవుతుంది.

ఎప్పుడైతే టీడీపీ తో బీజేపీ వ్యతిరేకంగా ఉన్నదో, దానిని ఆయా పత్రికలు విమర్శలతో, వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ అటు కేంద్రంలో కావచ్చు, ఇటు ఆయా రాష్ట్రాలలో కావచ్చు ప్రభుత్వం చిన్న తప్పు చేసినప్పటికీ దానిని కొండత చేసి ప్రజావ్యతిరేకత కూడగట్టడానికి వాళ్ళ శక్తిని మించి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఏపీలో విపక్షం మాదిరే దేశంలో బీజేపీని దించడానికి ఈ తరహా ప్రచారాలను ఎంచుకున్నారు. బీజేపీ ఇవన్నీ అర్ధం చేసుకొని కలుపుకొని పోవడానికి చూస్తుంది. అది జరిగితే కాస్తోకూస్తో తెలుగు రాష్ట్రాలలో అదీ ముఖ్యంగా ఏపీలో బ్రతికి బట్టకట్టే అవకాశాలు ఉన్నాయి. చూడాలి బీజేపీ వ్యూహం ఏంటనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: