చంద్రబాబునాయుడు కూడా రాజ్యాంగం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటమే విచిత్రంగా ఉంది. రహదారులపై సభలు, సమావేశాలు నిర్వహించకుండా ప్రభుత్వం జీవో 1ని జారీచేసింది. జీవో 1 రాజ్యాంగ విరుద్ధమని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో కేసు వేశారు. ఆ కేసును విచారించిన కోర్టు రామకృష్ణ వాదనతో ఏకీభవించి జీవోను కొట్టేసింది. ప్రతిపక్షాల, ప్రజల ప్రాధమిక హక్కులను కాలరాసేట్లుగా జీవో ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయపరీక్ష ముందు ప్రభుత్వం జీవో నిలవదని కోర్టు అభిప్రాయపడింది.





కోర్టు తీర్పుపై చంద్రబాబు హర్షం వ్యక్తంచేశారు. జీవో 1 రద్దుతో అంబేద్కర్ రాజ్యాంగం గెలిచిందన్నారు. దేశంలో అంతిమంగా గెలిచేది అంబేద్కర్ రాజ్యాంగమే అని మరోసారి నిరూపితమైందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వస్తారని ముందే ఊహించి రాజ్యాంగంలో పౌరుల ప్రాధమిక హక్కులకు రక్షణ కల్పించినట్లు అభిప్రాయపడ్డారు. అధికారం తెచ్చిన అహంకారం, నియంత ఆలోచనలు రాజ్యాంగం ముందు నిలబడవని మరోసారి రుజువైందన్నారు.





విచిత్రం ఏమిటంటే చంద్రబాబు కూడా రాజ్యాంగం గురించి మాట్లాడటమే. పైగా అహంకారం, నియంత ఆలోచనలు రాజ్యాంగం ముందు నిలబడవని అభిప్రాయపడటమే పెద్ద జోక్. తన పరిపాలనంతా రాజ్యాంగం ప్రకారమే నడిచిందన్నట్లుగా చంద్రబాబు మాట్లాడారు. తాను అధికారంలో ఉన్నపుడు వైసీపీ తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలు, 3 ఎంపీలను లాక్కున్నారు. ఏ రాజ్యాంగం ప్రకారం అలా లాక్కున్నారు ? స్ధానిక సంస్ధల ఎన్నికలను వెంటనే నిర్వహించాలని 2018లో హైకోర్టు తీర్పిస్తే లెక్కేచేయలేదు.  అలాంటి చంద్రబాబు కూడా రాజ్యాంగం, న్యాయం గురించి మాట్లాడారు.





నిజానికి ప్రభుత్వం జీవో 1 తీసుకురావటానికి కారణమే చంద్రబాబు. తన రోడ్డుషోల్లో జనాలు విపరీతంగా హాజరవుతున్నారని కలరింగ్ ఇచ్చుకునేందుకు కావాలనే ఇరుకిరుకు సందుల్లో సమావేశాలు నిర్వహించిన కారణంగానే నెల్లూరు రోడ్డుషోలో 8 మంది చనిపోయారు. ఆ తర్వాత గుంటూరులో నిర్వహించిన మరో సభలో ముగ్గురు చనిపోయారు. ఈ మధ్య ఒంగోలు సభలో మరో వ్యక్తి చనిపోయాడు. నెల్లూరు ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం రోడ్డుషోలకు కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది. దాన్ని ప్రతిపక్షాలు తట్టుకోలేకపోయాయి. అందుకనే రామకృష్ణ కోర్టులో కేసువేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: