
యోగ అనేది ప్రపంచాన్ని కలుపుతుంది.. 175 దేశాలలో యోగా చేయడం సాధారణ విషయం కాదు అంటూ తెలిపారు. ఇదంతా కూడా మనతోనే సాధ్యమైందని వెల్లడించారు.
నేవీకి చెందిన నౌకలలో కూడా యోగాసనాలు వేస్తూ ఉన్నారు. యోగాంద్రను నిర్వహించిన చంద్రబాబు, పవన్ లోకేష్ లకు అభినందనలు అంటూ తెలిపారు.
అందరి క్షేమమే నా కర్తవ్యం అని భారతీయ సంస్కృతి నేర్పిందని ప్రపంచంలో ఏదో ఒక సమస్యను ఎప్పుడూ ఎదుర్కొంటూ ఉంటుంది.ఇలాంటి పరిస్థితులలోనే యోగ శాంతికి తోడ్పడుతుందని తెలిపారు మోదీ.
యోగ మనలో మానవత్వాన్ని పెంచుతుంది. వ్యక్తిగత క్రమశిక్షణకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అంటూ వెల్లడించారు.
నేను అనే వాటి నుంచి మనం అనే భావనకు తీసుకువెళ్లే ఒక ఆయుధమే యోగ.
ప్రపంచానికి పెద్ద సమస్యగా మారినటువంటిదే ఒబేసిటీ.. మనం తీసుకునే ఆహారంలో నూనె పదార్థాలు 10 శాతం తగ్గించాలి యోగాను ప్రతిరోజు ఉదయం తప్పకుండా ఒక ఉద్యమంలో చేస్తే అందరి ఆరోగ్యం కూడా బాగుంటుంది అంటూ వెల్లడించారు.
విశాఖపట్నం సాగర్ తీరంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం చాలా గ్రాండ్ గా జరిగింది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 28 కిలోమీటర్ల వరకు సుమారుగా ఐదు లక్షల మందితో యోగాసనాలు వేశారు. అయితే ఇందులో పాల్గొన్న వారు శిక్షణ పొందిన వారిని మాత్రమే అక్కడి యోగాసనాలు వేస్తున్నారు.