ఐపీఎల్ ఈ ఏడాది భాగంగా నిన్నటి రోజున చెన్నై సూపర్ తో కింగ్స్ గుజరాత్ టీమ్ పోటీ పడగా చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోవడం జరిగింది. ఈ రోజున రెండు మ్యాచ్లు జరగబోతున్నాయి మొదట పంజాబ్ కింగ్స్ ,కోల్కత్త నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. మధ్యాహ్నం 3:30 నిమిషాలకు ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. అనంతరం లక్నో సూపర్ జైన్స్,ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీ పడనున్నాయి ఈ మ్యాచ్ మాత్రం రాత్రి 7:30 నిమిషాలకు ప్రారంభం కాబోతోంది. అయితే శుక్రవారం ప్రారంభమైన మొదటి మ్యాచ్లో గుజరాత్ గెలవడం జరిగింది.

ఐపీఎల్ రెండవ రోజు పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ మొహాలీలో ఇరుజట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. గత సీజన్లో కేకేఆర్ జట్టు ప్రదర్శన చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ గత ఏడాది కోల్కతా జట్టు ఏడవ స్థానంలో నిలిచింది.. గణాంకాలను పరిశీలిస్తే గత నాలుగేళ్లుగా KKR జట్టు మూడుసార్లు ప్లే ఆఫ్ కు అర్హత సాధించలేక పోయింది. కానీ ఈసారి జట్టు ఎలాగైనా సరే విజయం సాధించాలని గట్టిపట్టుదలతో ఉంది. కోల్కతా నైట్ రైడర్స్ కు నితీష్ రానా కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. అలాగే శ్రేయస్ అయ్యర్ స్థానంలో జట్టుకు కెప్టెన్గా ఎంపికయ్యారు.. అలాగే ఆండ్రి ర సేల్ అయ్యార్ నితీష్ రానా సునీల్ నారాయణ ఉమేష్ యాదవ్ తదితర బౌలర్లు మ్యాచ్ విన్నర్ల విభాగంలోకి వస్తారు


మొహలీల పంజా బ్ క్రికెట్ అసోసియేషన్ ఐఏఎస్ బింద్రా స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగబోతోంది.ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు మొత్తం 30 మ్యాచులు జరగగా ఇందులో కోల్కత్తా నైట్ రైడర్స్ 20 మ్యాచ్లు గెలిచింది. అయితే ఈసారి పంజాబ్ పై కోల్కతా జట్టు మెరుగైన రికార్డు నిలబెట్టుకోవాలని కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక పంజాబ్ కిమ్స్ లో కూడా బ్యాట్ మెన్స్ బౌలర్ ఆల్రౌండర్స్ బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఎవరు గెలుస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: