
ఇకపోతే యశ్ రాజు ఫీలింమ్స్ పతాకం పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమా జనవరి 25వ తేదీన తెలుగు, తమిళ్ , హిందీ భాషలలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ను శెర వేగంగా చేపడుతున్నారు చిత్రబంధం. ఈ క్రమంలోనే పఠాన్ సినిమాను ప్రమోట్ చేయడానికి వచ్చే వారంలోపు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలను సందర్శించి సినిమాను ప్రమోట్ చేయాలని పఠాన్ టీం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాను మొదటి రోజు మొదటి షో దేశవ్యాప్తంగా వివిధ నగరాలలో సుమారుగా 50వేల మందికి పైగా సినిమాను తిలకించనున్నారు. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశామని షారుక్ ఫ్యాన్ క్లబ్ ఎస్ ఆర్ కె యూనివర్సిటీ ప్రకటించడం జరిగింది.
ముఖ్యంగా ఢిల్లీ, హైదరాబాద్ , ముంబై తో సహా రద్దీగా ఉండే పట్టణాలలో 200 థియేటర్లలో అభిమానుల కోసం ఈ సినిమా ప్రదర్శితం అవుతుంది అని క్లబ్ సహ వ్యవస్థాపకుడు ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరుగుతున్నాయి మరి అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా హిట్టు కొడుతుందో లేదో చూడాలి.