సుమంత్ ప్రభాస్ హీరోగా నటించి దర్శకత్వం వహించిన తాజా చిత్రం మేమ్ ఫేమస్.. ఇందులో మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి కీలక పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే.

అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ ఈ సినిమాను నిర్మించారని తెలుస్తుంది.. కాగా ఈ సినిమా ఇటీవలె ఈ నెల 26న విడుదల అయ్యి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ సినిమాను చూసి సినిమాపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా పై దర్శకధీరుడు రాజమౌళి కామెంట్ చేశారు.

ఈ సందర్భంగా రాజమౌళి తన కామెంట్ లో ఈ విధంగా రాసుకొచ్చారు. చాలా కాలం తర్వాత థియేటర్లో పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రాన్ని నేను చూశాను. దర్శకుడు, నటుడు సుమంత్ కు మంచి భవిష్యత్ ఉంది. మేమ్ ఫేమస్ సినిమాలో నటించిన వారందరు కూడా ఎంతో సహజంగా అయితే నటించారు. ముఖ్యంగా అంజిమామ మాత్రం అదరగొట్టేశాడు. ఈ సినిమా చూడాల్సిందిగా ప్రతి ఒక్కరికీ నేను రెకమెండ్ చేస్తున్నాను. యూత్ను ఎంకరేజ్ చేయాలి.. దమ్ దమ్ చేయొద్దు అని పోస్ట్ లో రాసుకొచ్చారటా జక్కన్న. కాగా రాజమౌళి చేసిన కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇకపోతే రాజమౌళి విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ లలో ఒకరిగా రాణిస్తూ దూసుకుపోవడం తో పాటు, తెలుగు సినిమా ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడుగా దూసుకుపోతున్నారటా రాజమౌళి. కాగా రాజమౌళి ఇప్పటివరకు దర్శకత్వం వహించిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. గత ఏడాది విడుదల అయిన ఆర్ఆర్ఆర్ సినిమాకు దర్శకత్వం వహించిన రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో తెరకెక్కించబోతున్న సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులను చూసుకుంటూ ఎంతో బిజీబిజీగా వున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: