
అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇప్పుడు మూడు టీం లు గా విడిపోయి పనిచేస్తున్నట్లుగా వార్తలు అందుతున్నాయి. మొదటి నుండి తెలంగాణాలో సాధారణ కార్యకర్త నుండి మంత్రిగా ఎదిగిన కిషన్ రెడ్డి కి సెపరేట్ గా ఒక గ్రూప్ ఉంది. ఇక కరీంనగర్ నుండి గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడు అయిన నాటి నుండి తాను కూడా వేరొక టీమ్ ను రెడీ చేసుకుని వర్క్ చేస్తున్నాడు. ఇక తెలంగాణ లో అధికార పార్టీలో ఉండి... పార్టీ చేత ఉద్వాసనకు గురయ్యి ఉప ఎన్నికలో గెలిచి బీజేపీ లో ఎమ్మెల్యే గా ఉన్నాడు ఈటల రాజేందర్. ఇప్పుడు తెలంగాణాలో ఈయన తన పవర్ చూపించడానికి సిద్ధంగా ఉన్నారు.
ఇందుకు బీజేపీ హై కమాండ్ నుండి కూడా మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యర్థి పార్టీ తెరాస గురించి తనకు అన్ని విషయాలు తెలుసని అందుకే త్వరలోనే ఈటల రాజేందర్ కు బీజేపీ పగ్గాలు అందించే అవకాశాలు మెండుగా ఉన్నాయని వార్తలు అందుతున్నాయి. పైగా ఇటీవల చేసిన వ్యాఖ్యలు అందుకు ఊతమిస్తున్నాయి. నేను కేసీఆర్ నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిస్తాను అంటూ బహిరంగ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక బండి సంజయ్ పక్కకు తప్పుకోవాల్సిందే అంటూ పొంత పార్టీలోని నేతలే అంటున్నారట. మరి చూద్దాం ఏమి జరగనుందో ?