తెలుగుదేశం పార్టీ నాలుగు దశాబ్దాలు అద్భుతమైన గొప్ప రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది .. ఎన్నికల ఫలితాల్లో ఒకసారి గెలిచినా మరోసారి ఓడిన .. ఇప్పుడు అధికారంలో ఉండవచ్చు కానీ .. 1997లో ఆ పార్టీ ఆవిర్భావం నుంచి పలు విషయాలు విశ్లేషిస్తే భారత రాజకీయ చరిత్రలో ప్రత్యేకమైన పేజీని క్రియేట్ చేసుకున్న పార్టీ తెలుగుదేశం ..  పార్టీ మొదల నుంచి దేశ రాజకీయాల్లోనూ ఎంతో కీలక పాత్ర పోషిస్తున్న ప్రాంతీయ పార్టీ కూడా ఇప్పుడు మరో తరం దిశగా ఘనమైన తన ప్రయాణాన్ని మొదలుపెట్టబోతుంది . తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు మహానాడు జోష్ కనిపించబోతుంది .. కడపలో మూడు రోజులపాటు మహానాడు జరగబోతుంది ..
 

అధికారంలో ఉన్నారా లేరా అన్నదానితో సంబంధం లేకుండా మహానాడును టిడిపి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ వస్తుంది .. ప్రతిసారి రెండు రోజులు నిర్వహిస్తారు ఈసారి మాత్రం కడపలో మూడు రోజులపాటు గట్టిగా ప్లాన్ చేశారు .. చివరి రోజు భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు .. అలాగే ఈ మహానాడు పార్టీకి ఎంతో కీలకంగా మారనుందని అంటున్నారు .. టిడిపి భవిష్యత్ నాయకత్వాన్ని ఈ మహానాడు వేదికగా అందించబోతుందని కూడా అంచనా వేస్తున్నారు . ఓ ప్రాంతీయ పార్టీ ఎప్పుడైనా ఏ రాష్ట్రంలోనైనా కుటుంబ పార్టీగానే ఉంటుంది .. అలాగే ఆ కుటుంబ పరపతి తగ్గితే ఆ పార్టీ ప్రాధాన్యత ప్రభావం కూడా తగ్గిపోతుంది .. ఇక మన భారతీయ రాజకీయ చరిత్రలో ఇలాంటి ప్రాంతీయ పార్టీలు ఎన్నో ఉన్నాయి .. కానీ కుటుంబం పిల్లర్ గా ఉన్నప్పటికీ ప్రజల్లోకి చొచ్చుకపోయే అది మా పార్టీ అనే భావన కలిగించిన పార్టీ ఒక్క టిడిపి మాత్రమే ..


ఎన్టీఆర్ పార్టీ పెట్టిన చంద్రబాబు ముందుకు నడిపించారు .. ఇక ఇప్పుడు మరో తరం ఆ పార్టీని ముందుకు నడిపించేందుకు రెడీ అవుతుంది .. నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టాలన్న డిమాండ్ పెరిగిపోతుంది .. అయితే దానికి అయినా అన్ని విధాల సమర్థుడు భవిష్యత్తు పార్టీ వ్యూహాల్లో ఈ నిర్ణయం ఎంతో కీలకం కూడా ..  ఇప్పటికే తెలుగుదేశంలో మరో తరం కీలకంగా మారనుంది .. గత ఎన్నికల్లో యువరత్తం ఎన్నికల్లో ఎక్కువగా పోటీ చేశారు .. రాబోయే తరానికి వారసులు ప్రజల నుంచి వచ్చిన వారు తమ దైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు .. ఇక వీరంతా టిడిపి భవిష్యత్తు లాంటి వారు ఇప్పుడు వారికి బాధ్యతలు ఇస్తే వచ్చే కొద్ది నెలల్లోనే పార్టీ అంతా తామై నడిపించుకుంటూ పోతారు దీనికి ఈ మహానాడు వేదిక కాబోతుంది .. కడప వేదికగా టిడిపి మరో తరం దిశగా ఈ మహా ప్రయాణానికి సిద్ధం కాబోతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: