నేటి మంచిమాట.. ప్రవర్తన అద్దంలాంటిది, ప్రతీ వ్యక్తి ప్రతిబింబం దానిలో కనిపిస్తుంది! అంతేకదా.. నువ్వు మంచిగా ఉంటే వాళ్ళు మంచిగా ఉంటారు.. నువ్వు రక్షేశంగా ప్రవర్తిస్తే వాళ్ళు రక్షేశంగానే ప్రవర్తిస్తారు.. నువ్వు వాళ్ళను చూసి చిన్న చిరు నవ్వు అందిస్తే వాళ్ళు చిరునవ్వులు చిందిస్తారు.. లేదు అంటే వాళ్ళు మొహం ముడుచుకుంటారు. 

 

ఈ విషయం మీ అందరికి తెలుసు కదా! మీరు కూడా వాట్సాప్ స్టేటస్, ఫేసుబుక్ డీప్ లు పెడుతుంటారు.. నేను అద్దంలాంటిదాన్ని.. నీ ప్రవర్తన బట్టి నేను ఉంటా అని. అవును.. నీ ప్రవర్తన బాగుంటే వాళ్ళు మిమ్మల్ని గౌరవించి.. ఇష్టపడి.. మర్యాద ఇస్తారు. లేదు అంటే వాళ్ళు మిమ్మల్ని అగౌరవ పరుస్తారు.. మిమ్మల్ని అవమానిస్తారు.. మిమ్మల్ని చూడగానే మొహం తిప్పుకుంటారు. 

 

సో మనం అందరితో మంచిగా ఉందాం.. మనం నలుగురికి సహాయం చేద్దాం.. ఆ నలుగురులో అందరూ స్పందించకపోయిన ఎవరో ఒకరు అయినా స్పందిస్తారు.. మనకు కష్టం వచ్చినప్పుడు సహాయపడతారు.. సో మనం చేసే పనులు బట్టే మనతో ఉండే వారి ప్రవర్తన ఉంటుంది. ఇది గుర్తించుకొని అందరితో ప్రవర్తించండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: