
ఈ క్రమంలోనే రీఎంట్రీ తర్వాత సూపర్ ఫాం కనబరిస్తున్న రవీంద్ర జడేజా ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ కావడం గమనార్హం. ఆసియా కప్ సమయంలో మోకాలి కాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు రవీంద్ర జడేజా. ఆ తర్వాత శస్త్ర చికిత్స కారణంగా దాదాపు 5 నెలల పాటు ఇక క్రికెట్కు దూరంగానే ఉన్నాడు అని చెప్పాలి. కానీ పట్టుదలతో త్వరగా కోలుకొని మళ్ళీ పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించి భారత జట్టులోకి వచ్చేసాడు. అయితే భారత జట్టులోకి వచ్చిన తర్వాత అతను మళ్లీ పుంజుకోవడానికి మైదానంలో సర్దుకుపోవడానికి కాస్త సమయం పడుతుందని అందరు అనుకున్నారు. కానీ రీ ఎంట్రీ మ్యాచ్లోనే అదిరిపోయే ప్రదర్శన చేశాడు.
ఏకంగా బ్యాట్ తో బంతితో కూడా మెరుపులు మెరిపించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నాడు అని చెప్పాలి. తర్వాత జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ లలో కూడా జడేజా ప్రదర్శన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇకపోతే ఇలా సూపర్ ఫామ్ కనబరిచిన రవీంద్ర జడేజా ఇప్పుడు ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు అని చెప్పాలి. ఫిబ్రవరి నెలకు గాను అత్యుత్తమ ఫామ్ కనబరిచిన క్రికెటర్లను ఐసిసి ప్రకటించింది. అయితే ఇక జడేజా ఫామ్ చూస్తే మాత్రం అందరిని వెనక్కినెట్టి అవార్డు గెలుచుకోవడం ఖాయం అని అభిమానులు కూడా అనుకుంటున్నారు.