
ఇక సామాన్యులు పెట్రోల్ ధరల బాదుడుని తట్టుకోలేక పోతున్నారు. ఇక తక్కువ ధరకే ఎక్కువ దూరం ప్రయాణించేలా ఏదైనా వాహనం వస్తే బాగుండు అని కోరుకుంటున్నారు అని చెప్పాలి. ఇలాంటి సమయం లోనే కొంత మంది యువకులు తమ మేధో శక్తికి పదును పెట్టి ఇక వినూత్నమైన ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే తక్కువ ఖర్చు తోనే ఎక్కువ దూరం ప్రయాణించేలా.. ఇక ఎన్నో కొత్త వాహనాలను కనుగొంటూ ఉన్నారు. ఇక్కడ ఒక యువకుడు ఇలాంటిదే చేసి ఔరా అనిపించుకున్నాడు అని చెప్పాలి. కేవలం పది పైసలు ఖర్చుతో కిలోమీటర్ దూరం ప్రయాణించె ఈ బైస్కిల్ ను తయారు చేశాడు.
మధ్యప్రదేశ్ లోని చతర్పూర్ జిల్లాకు చెందిన ఆదిత్య శివ హరే అనే 20 ఏళ్ల యువకుడు ఈ వినూత్నమైన ఆవిష్కరణకు శ్రీకరం చుట్టాడు. అతను తయారు చేసిన ఈ సైకిల్ 100 కిలోల బరువు కూడా మోసుకెళ్తుందట. పేదలకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే ఇక ఆదిత్య బ్యాటరీతో నడిచే సైకిల్ను రూపొందించినట్లు చెప్పుకొచ్చాడు. దీనికోసం నెల రోజులపాటు అతను ఎంతగానో కష్టపడ్డాడట. అయితే ఇప్పటికే ఆదిత్య ఈ ఎన్నో రకాల అరుదైన ఆవిష్కరణలు చేసి అవార్డులు కూడా దక్కించుకున్నాడు. ఈ సైకిల్ తయారీకి 20,000 ఖర్చు అయ్యిందట. ఒకసారి ఛార్జ్ చేస్తే 30 కిలోమీటర్ల వరకు వెళుతుందట.