పదివేల ఓట్లు సాధించగల వ్యక్తులున్నారా.. అయితే వీరిని తీసుకురండి వారికి ఎమ్మెల్సీ ఇద్దాం. లేదా ఎమ్మెల్యే సీటు ఇద్దాం అనే విధంగా సీఎం జగన్ వైఖరి ఉన్నట్లుగానే కనిపిస్తోంది. చేనేత కార్మికుల్లో పలుకుబడి ఉన్న మాజీ ఎమ్మెల్యే అభ్యర్థికి ఎమ్మెల్సీ ఇవ్వడం దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. కొల్లేరు ప్రాంతంలో వడ్డె కులస్థులకు సంబంధించిన జయమంగళ వెంకట రమణకు ఛాన్స్ ఇవ్వడం. ఎందుకంటే వీరు స్వతంత్రంగా ప్రజల్లో పట్టున్న నాయకులు.


దాదాపు వీరు ఎన్నికల్లో నిలబడితే కుల సమీకరణాలతో 10 వేల ఓట్లు సాధించగల సత్తా  ఉందని జగన్ నమ్ముతున్నారు. ఇదే పరిస్థితుల్లో టీడీపీకి చెందిన ముగ్గురు బీసీ నాయకులను వైసీపీ తన పార్టీలో చేర్చుకోనుందని తెలుస్తోంది. వీరు కర్నూల్, కోస్తా ఆంధ్రకు చెందిన వారిగా అనుకుంటున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకు ఎలాగైతే ప్రాధాన్యం ఇచ్చారో..  వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు చేర్చుకునే వారికి అవకాశం కల్పించేందుకు జగన్ సిద్ధమయినట్లు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.


మొత్తంగా బీసీలను జగన్ పార్టీ దగ్గర చేసుకుని వచ్చే ఎన్నికల్లో ఎన్ని రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకున్నా చివరకు గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. కానీ ఇక్కడ ఎన్నో ఎళ్లుగా వైసీపీ ని నమ్ముకున్న ఆయా నియోజకవర్గాల్లోని నేతల పరిస్థితి దారుణంగా తయారైంది. ఎందుకంటే వారిలో అప నమ్మకం పెరిగిపోయి, పదవులు రావనే భావనలో జగన్ ను తిట్టలేక, పార్టీ నుంచి బయటకు వెళ్లలేక సతమతమవుతున్నారు.


బీసీల ఓట్లే కేంద్రంగా టీడీపీ రాజకీయాలు చేయడం ఇప్పటి వరకు అందరికి తెలిసిన విషయం. కానీ ప్రస్తుతం జగన్ ఆ దిశగా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎక్కువ మంది బీసీలకు అవకాశమిచ్చారు. రాబోయే ఎన్నికల్లో కూడా ఎంతమందికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటి వరకు జగన్ నే నమ్ముకున్న కొంతమందికి మొండిచేయి ఎదురు కావడం తథ్యం.

మరింత సమాచారం తెలుసుకోండి: