సామాన్యులకు కూడా ఊరట కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఎల్పిజి సిలిండర్ ధరలను తగ్గించింది.. చాలా కాలం తర్వాత సామాన్యులకు కాస్త ఊరట కలిగించిందని చెప్పవచ్చు. ఈరోజు 2024 ఆర్థిక సంవత్సరం మొదటి రోజు కావడంతో.. ఈ విధంగా తెలియజేసినట్లు సమాచారం. ప్రభుత్వం ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తూ ఏప్రిల్ మొదటి రోజున ఎల్పిజి ధర రూ.92 రూపాయలు తగ్గించింది.. అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు మాత్రమే ఈ రేటు వర్తిస్తుందట డొమెస్టిక్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలలో ఎలాంటి మార్పులు లేదు.


14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర గత కొన్ని నెలలుగా ఇలాగే ఉన్నది మార్చిలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.350  రూపాయల పెంచిన ప్రభుత్వం ఈ రోజున 92 రూపాయలు తగ్గించింది.. కొత్త రేట్లు అనుగుణంగా.. ధరల విషయానికి వస్తే.. ఢిల్లీలో రూ.2028 రూపాయలు కోలకతా లో రూ.2132 రూపాయలు కాక ముంబైలో  రూ.1980 రూపాయలు కాక చెన్నైలో రూ.2192.50 రూపాయలు అన్నట్లుగా తెలుస్తోంది..


ఇక గృహ వినియోగదారుల సిలిండర్ ధరలు ఈనెల మొదటి నుంచి.. ఢిల్లీలో రూ.1,103 రూపాయలు పాట్నాలో రూ.1,202 రూపాయలు.. ఐజ్వాల్ రూ.1255 రూపాయలు, అండమాన్ రూ.1179 రూపాయలు భోపాల్ రూ.1118.5 రూపాయలు ,అహ్మదాబాద్ రూ.1110 , జైపూర్ 1116.5, ముంబై రూ.1112.5, కన్యాకుమారి, రూ.1187 రాంచి రూ.1160 , లక్నో రూ.1140, కోలకత్తా రూ.1129, విశాఖపట్నం రూ.1111 చెన్నై రూ.1118, అగ్రా రూ.1115  రూపాయలు కలవు.


దేశీయ LPG  సిలిండర్ల మాదిరిగా కాకుండా వాణి గ్యాస్ ధరలు మారుతూ ఉంటాయి.. ఏప్రిల్ ఒకటి 2002లో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర. రూ.2,253 అందుబాటులో ఉండగా ఈరోజు ధర చూసుకున్నట్లయితే రూ.2,028 రూపాయలకు తగ్గింది గత ఏడాది కాలంలో ఢిల్లీలో మాత్రమే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర దాదాపుగా రూ.225 రూపాయలు తగ్గిందని చెప్పవచ్చు. ఇక ఆయా రాష్ట్రాలలో కూడా గ్యాస్ సిలిండర్ ధరలు వేరువేరుగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: