తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ లాంటి హీరో గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. సినీ ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల పాటు హీరోగా ఒక వెలుగు వెలిగారని చెప్పవచ్చు.

ఆ తర్వాత రాజకీయంగా కూడా తన హవా కొనసాగించారు. ఇక ఎన్టీఆర్ దర్శకుడు తాపీ చాణక్య చెప్పిన కథను ఒప్పుకొని ఆ సినిమాలో నటించడం మరొక విశేషం అని చెప్పవచ్చు. అయితే అందులో ఏముంది అనుకుంటే ఎన్టీఆర్ అప్పటికే స్టార్ హీరో ఇమేజ్ ను సొంతం చేసుకున్నారట. అయినా కూడా ఈ సినిమాలో వికలాంగుడి పాత్రలో నటించారట.

అయితే అప్పట్లో ఎన్టీఆర్ ఈ సినిమాని రిజెక్ట్ చేసి ఉంటే ఇప్పటివరకు ఒక గొప్ప క్లాసిక్ సినిమా ను అయితే ఉండేది కాదని తెలుస్తోంది. ఈ చిత్రమే కలసి ఉంటే కలదు సుఖం. ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరు కూడా స్టార్స్ అన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా సావిత్రి సినిమా మొత్తం తన నటనతో డామినేట్ చేసిందని చెప్పవచ్చు. అయినా కూడా ఈ సినిమాలో అవిటి పాత్రలో ఎన్టీఆర్ ప్రాణం పోసి నటించారు. ఇక ఎన్టీఆర్ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరే హీరోకు కూడా అప్పట్లో లేదని చెప్పవచ్చు.

 
తెలుగు సినీ ప్రేక్షకులు సైతం ఎన్టీఆర్ ని ఒక దేవుడులా కొలిచేవారు. ఎన్టీఆర్ ఒక సినిమాకి ఎంత బాగా డబ్బు వచ్చినా.. అవార్డు వచ్చినా .. కూడా మనకు ఆత్మ సంతృప్తి కలగదు .. కానీ కలిసి ఉంటే కలదు సుఖం వంటి సినిమాలలో నటిస్తే వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేనిది అని అప్పట్లో ఎన్టీఆర్ ఎన్నోసార్లు కూడా ఈ సినిమా గురించి పొగడడం జరిగిందట. ముఖ్యంగా ప్రతి ఒక్క కుటుంబంలో ఉండాల్సిన ప్రేమ, అభిమానాలు , కోపాలు, అహంకారం, అలకలు అన్నీ కూడా ఈ చిత్రంలో ఎంతో అద్భుతంగా చూపించారని చెప్పవచ్చు. ఇప్పటి హీరోలు ఇలాంటి సినిమాలు తీస్తే ప్రేక్షకులు ఆదరించకపోవడం బాధాకరమని చెప్పవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి: