టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరో లలో ఒకరు అయినటు వంటి నిఖిల్ ప్రస్తుతం 18 పేజీస్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. పల్నాటి సూర్య ప్రతాప్మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండగా  ,అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ లలో ఒకరు అయినటు వంటి సుకుమార్ కథను అందించగా , గోపి సుందర్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని డిసెంబర్ 23 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం రెండు పాటలను విడుదల చేసింది. ఈ రెండు పాటలకు కూడా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లోని ఒక పాటను తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి శింబు పాడాడు. 

శింబు పాడిన పాటను ఇప్పటికే ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ పాటకు కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా 18 పేజెస్ మూవీ లో తనకు చాలా ఇష్టమైన పాట ఏది అనే విషయాన్ని నిఖిల్ సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చాడు. శ్రీమణి లిరిక్స్ ,  సిద్ శ్రీరామ్ పాడటం జరిగింది , సుకుమార్ , గోపి సుందర్ కాంబినేషన్ లో రాబోయే పాట తన మోస్ట్ ఫేవరెట్ సాంగ్ అని నిఖిల్ తెలిపారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఇలా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న 18 పేజెస్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: