ప్రస్తుతం ఆహా ఓటీటి వేదిక ద్వారా బాగా పాపులర్ అయింది అన్ స్టాపబుల్ షో. ఇక ఈ షోలో నందమూరి బాలకృష్ణ ఆహా యాజమాన్యంతో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఇక మొదటి సీజన్ మంచి విజయాన్ని అందుకోవడంతో సీజన్ 2 ని కూడా చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఆహా టీం.మొదటి సీజన్లో రాజకీయ నాయకులు రాలేదు. అంతే కాదు రాజకీయ అంశాలు కూడా లేవు.. అయితే  రెండవ సీజన్లో మాత్రం చాలామంది రాజకీయ నాయకులు వచ్చి ఎంతో సందడి చేశారు .ముఖ్యంగా టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ షో కి రావడంతో ఈ షో ఎంతో ఆదరణని పొందింది అనడంలో ఎలాంటి సందేహం లేదు .

అయితే తాజాగా ఈ షో గురించి దర్శకుడు బివిఎస్ రవి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు. దీంతో ఆయన చెప్పిన విషయాలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ గెస్ట్ లకు ఏ ఇబ్బంది లేకుండా ఉండే ప్రశ్నలు మాత్రమే బాలకృష్ణ అడుగుతాడని.. గెస్ట్ లకు ఇబ్బందిగా ఉండే ప్రశ్నలను అసలు అడగడు అని.. ఇక ఈ విషయాన్ని ఆహా యాజమాన్లకు ముందుగానే బాలకృష్ణ స్పష్టం చేశారు అని చెప్పుకొచ్చాడు ఆయన. సాధారణంగా బాలకృష్ణకు ఒక విషయం చెప్పిన తర్వాత మళ్లీ అదే విషయాన్ని రిపీట్ చేస్తే ఆయనకు చాలా కోపం వస్తుంది.

 ఇక అలాగే చంద్రబాబుని కలిసినప్పుడు షోలో ఏ ప్రశ్న అయినా అడగవచ్చు అని చెప్పారట.. ఈ నేపథ్యంలోనే లోకేష్ ఓటమి గురించి ఫోటోల గురించి అడుగుతామని చెప్పడంతో ఆయన కూడా ఓకే చేశారని తెలిపారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ఎపిసోడ్కి సంబంధించిన షూటింగ్ దాదాపు 6 గంటలకు పైగా నేను జరిగింది అంటూ ఒక సీక్రెట్ ని రివిల్ చేశాడు ఆయన. అయితే తాజాగా ఈ షో కి సంబంధించిన మూడో సీజన్ మీ తర్వాత నుండి ప్రారంభం కానుంది అని తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: