జరిమానా అనే పేరు వింటే ఇప్పుడు ప్రజలు భయపడిపోతున్నారు.  కారణం కొత్త మోటార్ వాహన చట్టం.  ఈ కొత్త మోటార్ వాహన చట్టం అమలులోకి వచ్చిన తరువాత జరిమానాలు విధించడం ఎక్కువైంది.  జరిమానాలు విధింపుతో ప్రజలు లైన్లోకి వచ్చారు.  ఇప్పుడిప్పుడే ఖచ్చితమైన రూల్స్ ను పాటిస్తున్నారు.  రూల్స్ ను పాటించకుండా ఉంటె జరిగే పరిణామాలు ఏంటో అందరికి తెలిసిందే.  


కాగా, ఇప్పుడు పాటిస్తున్న నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరు నడుచుకుంటున్నారు.  ఇలా ప్రతి రంగంలో కూడా మార్పులు చోటు చేసుకుంటే దేశం యావత్తు అద్భుతంగా ఉంటుంది.  ఆలా కాకుంటే మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  తినే తిండి విషయంలో మనిషి అనేక అలవాట్లు చేసుకుంటున్నాడు.  ఆ అలవాట్ల కారణంగా మనిషి తన జీవన ప్రమాణాన్ని స్వయంగా పాడుచేసుకుంటున్నాడు.  చేతిలో డబ్బు ఉండటంతో మనిషులు రెస్టారెంట్ కు వెళ్లి కావాల్సినవి తింటూ ఆరోగ్యాన్ని డబ్బును నాశనం చేసుకుంటున్నాడు.  ఇది వేరే విషయం అనుకోండి.  


ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఇటీవలే ఓ వ్యక్తి పారడైజ్ బిర్యానీకి సెంటర్ కు వెళ్ళాడు.  అక్కడ బిర్యానీ ఆర్డర్ చేశాడు.  కానీ, బిర్యానీ తినే సమయంలో అందులో వెంట్రుక వచ్చింది.  వెంటనే ఆ వ్యక్తి క్యాష్ కౌంటర్ లో ఫిర్యాదు చేశాడట.  కానీ, అతను సరిగా సమాధానం చెప్పడం కానీ, పట్టించుకోవడంగాని చేయలేదు.  దీంతో వినియోగదారుడికి కోపం వచ్చింది.  


వెంటనే జీహెచ్ఎంసి లో కంప్లైట్ చేశారు.  వినియోగదారుడి కంప్లైంట్ తీసుకున్న సదరు అధికారులు పారడైజ్ బిర్యానీ రెస్టారెంట్ పై దాడి చేశారు. అక్కడ పరిశుభ్రత గురించి, లోపల వినియోగించే పాత్రల చెక్ చేశారు.  కానీ, ప్రమాణాలకు తగినట్టుగా లేకపోవడంతో లక్షరూపాయల జరిమానా విధించారు.  ఈసారి జరిమానాతో సరిపెడుతున్నామని, ప్రమాణాలు పాటించకుంటే సీజ్ చేస్తామని చెప్పారు.  మరోవైపు సరూర్ నగర్ లోని కేఫ్ బహార్ హోటల్ కు కూడా ఇలానే జరిమానా విధించడం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: