ప్ర‌ముఖ ఫుట్‌బాల్ స్టార్ ఆట‌గాడు.. పోర్చుగ‌ల్ దేశానికి చెందిన క్రిస్టియానో రొనాల్డో అత్యంత ధ‌న‌వంతుడైన దిగ్గ‌జ ఆట‌గాడిగా రికార్డు న‌మోదై ఉంది. జువెంటస్ క్ల‌బ్ త‌రుపున గ‌త సీజ‌న్‌వ‌ర‌కు ఆడాడు. కానీ ప్ర‌స్తుతం రొనాల్డో మాంచెస్ట‌ర్ యునైటేడ్‌కు మారాడు. ప్ర‌పంచంలో అత్య‌ధిక మంది అభిమానుల‌ను క‌లిగి ఉన్న ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఎవ‌ర‌న్న ఉన్నారంటే అది రొనాల్డోనే అని చెప్ప‌వ‌చ్చు. యునైటేడ్ త‌రుపున‌నే త‌న క్ల‌బ్ కేరీర్ ఆరంభించాడు. మ‌ర‌ల తిరిగి త‌న సొంత గూటికే చేరాడు. తాను ఇట‌లీ నుంచి మ‌కాం మార్చి మాంచెస్ట‌ర్‌లోని చేషైర్‌కు చేరాడు. చేషైర్ కౌంటీలో రొనాల్డోకు  ఓ మాన్ష‌న్ ఉంది. అటు నుంచే మ్యాచ్‌ల‌కు హాజ‌ర‌వుతుంటాడు. గ‌తంలో ఇట‌లీ నుంచి వెళ్లే వాడు. రొనాల్డోకు 36 ఏండ్లున్న ఎంతో ఫిట్‌గా ఉన్నాడు. అత‌ని ఫిట్‌నెస్ లెవ‌ల్స్ ఏమాత్రం త‌గ్గ‌డం లేదు అని, ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

అత‌ను ప్ర‌తీ మ్యాచ్ ముగించుకున్న వెంట‌నే క్ర‌యోథెర‌ఫీ చేయించుకుంటాడు. ఇందుకు ఏకంగా రూ.50వేల ఫౌండ్లు  అన‌గా దాదాపు రూ.51ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చు అవుతుంది. దీనిని ఐస్ బాత్ ట‌బ్ అని కూడా పిలుస్తారు.  ఇంటికి వెళ్లిన త‌రువాత రొనాల్డో  5 నిమిషాల వ‌ర‌కు ఆ ట‌బ్‌లోనే గ‌డుపుతాడు. స్నానం అన‌గా మ‌నం సాధార‌ణంగా చేసే నీటితో కాదు. క్ర‌యోథెర‌ఫీ చాంబ‌ర్‌లో -200 డిగ్రీల  సెంటిగ్రేడ్ ఉష్ణోగ‌త వ‌ద్ద ప్ర‌త్యేక‌మైన ర‌క్ష‌ణ క‌వ‌చాన్ని ధ‌రించి వెళ్తాడు.  

బాస్కెట్‌బాల్ త‌యారీ రంగంలో వాడేట‌టువంటి చ‌ర్మం మాదిరిగా ఉన్న కోటును ధ‌రించి ఆ చాంబ‌ర్‌లోకి చేరుతాడు. అక్క‌డ లిక్విడ్ నైట్రోజ‌న్‌ను పంప్ చేస్తుంటుంది. దీంతో శ‌రీరం అత్యంత శీతలంగా త‌యార‌వుతుంది. ఈ విధంగా చేయ‌డంతో ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ చాలా మెరుగుగా స‌క్ర‌మంగా సాగుతుంది. రోగ నిరోద‌క‌శ‌క్తి సైతం రోజు రోజుకు మెరుగ‌వుతుంది. కేవ‌లం 5 నిమిషాలు మాత్ర‌మే ఉండాలి. 5 నిమిషాల కంటే ఎక్కువ ఉన్న‌ట్ల‌యితే అనారోగ్య స‌మ‌స్య‌లు త‌ల‌త్తే అవ‌కాశం ఉంటుంది.  నిపుణుల స‌ల‌హా మేర‌కు చాంబ‌ర్‌లోకి వెళ్లాలి. రొనాల్డో మాత్రం గ‌త ఏడేండ్ల కాలం నుంచి దీనిని వినియోగిస్తున్నాడు. ఇట‌లీలోని ఇంట్లో ఉన్న చాంబ‌ర్‌ను ఇటీవ‌ల మాన్ష‌న్ వ‌ద్ద‌కు మార్చుకున్నాడు.  




మరింత సమాచారం తెలుసుకోండి: